ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Zodiac Signs: సూపర్ న్యూస్.. ఈ 5 రాశుల వారికి వారం అంతా అదృష్టమే..!

ABN, Publish Date - Jul 01 , 2024 | 11:36 AM

July Horoscope: జులై 1వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం అవుతుంది. ఈ కొత్త వారంలో కొన్ని రాశుల(Zodiac Signs) వారికి అంతా శుభప్రదంగానే ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ వారం మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుందట. వృత్తి, వ్యాపారం, చదువులు, ప్రేమ సంబంధాలు, వివాహ బంధాల విషయంలో..

July Horoscope

July Horoscope: జులై 1వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం అవుతుంది. ఈ కొత్త వారంలో కొన్ని రాశుల(Zodiac Signs) వారికి అంతా శుభప్రదంగానే ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ వారం మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుందట. వృత్తి, వ్యాపారం, చదువులు, ప్రేమ సంబంధాలు, వివాహ బంధాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మరి జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ఆ 5 రాశులు ఏంటో ఓసారి చూద్దాం..


వృషభరాశి: ఈ వారం మొత్తం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులు త్వరలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా స్థిరాస్థిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అడ్డంకులు తొలగిపోయి.. స్థిరాస్థిని కొనుగోలు చేస్తారు. ఇంటికి ఆత్మీయుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వారం మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం సంతోషంగా ఉంటారు.


మిథునరాశి: ఈ రాశి వారికి కొత్త వారం గొప్పగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రేయసి/ప్రియుడుతో సమన్వయం ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం.

కన్యారాశి: ఈ వారం కన్యా రాశి వారికి విజయాన్ని అందిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ వారం మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే.. ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మీ భాగస్వామితో అనుబంధం బాగుంటుంది.


మకరరాశి: జూలై మొదటి వారం మకర రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్ధతు పొందుతారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి మీకు లాభాన్ని ఇస్తుంది. మీ భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపే అవకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశి వారికి కొత్త వారం అదృష్టాన్ని తెస్తుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే, ఈ వారంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. కొత్తగా పెళ్లయిన వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని చూస్తారు.

For More Astro News and Telugu News..

Updated Date - Jul 01 , 2024 | 11:36 AM

Advertising
Advertising