ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

ABN, Publish Date - Sep 29 , 2024 | 08:50 AM

అప్పటికప్పుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని పించించది. ఫ్యామిలీతో కలిసి వెళ్లితే ఆ కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోగలమా? అంటూ పలువురు భక్తులు సందేహం వ్యక్తం చేస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూల నుంచి తిరుమలకు తరలి వస్తారు. వారంతా దాదాపుగా రెండు మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లలో స్వామి వారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. దీంతో స్వామి వారి దర్శనానికి టికెట్లు లభించవు.


దసరా సెలవులు..

మరో వైపు దసరా పండగ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలను తీసుకుని ఏదో ఒక పుణ్య క్షేత్రానికి వెళ్లాలని అంతా భావిస్తుంటారు. కానీ టికెట్లు లభ్యంకావు... అలాంటి వేళ స్వామి వారి దర్శనం ఎలా అంటూ శ్రీవారి భక్తులు ఆలోచనలో పడతారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది.


తిరుమలలో కాదు.. తిరుపతిలోనే..

అందులోభాగంగా.. SSD (స్లాటెడ్ సర్వ దర్శనం), దివ్య దర్శనం, ఉచిత దర్శనం వంటివి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ SSD టికెట్లు ప్రతిరోజు ఉదయం 3 గంటలకు తిరుపతిలోని (తిరుమలలో కాదు) విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే.. ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇక SSD టికెట్లు ఇచ్చేటప్పుడు.. టైమ్, ఎంట్రీ వివరాలు సైతం ఇస్తారు. దీంతో ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లి.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడిని ఉచితంగానే దర్శించుకోవచ్చు.


క్యూ లైన్లలో వెళ్లితే మాత్రం..

ఇక మరికొందరు కాలినడకనే తిరుమలకు వెళ్తారు. వారికి సైతం భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. ఈ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అయితే ఎస్ఎస్‌డి, దివ్యదర్శనం.. ఈ రెండు టికెట్లు దాదాపుగా ఇంచుమించిగా ఒక్కటే. ఓ వేళ.. ఈ టికెట్లు సైతం దొరక్కొంటే.. తిరుమలలో ఉచిత క్యూలైన్‌లో వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఉచిత దర్శనానికి వెళ్తే మాత్రం చాలా సమయం పడుతుంది.


6 నుంచి 8 గంటలు..

ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. పిల్లాపాపలతో వెళ్తే మాత్రం కొంత ఇబ్బంది మాత్రం తప్పదు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్దకు చేరుకుని టికెట్లు పొందితే స్వామి వారి దర్శనం భక్తులు ఈజీగా చేసుకోవచ్చు.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Sep 29 , 2024 | 09:13 AM