Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:47 PM
దేవ దేవుళ్లు ఎంత మంది ఉన్నా.. వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి. భద్రపద మాసం మంగళవారం నుంచి.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
దేవ దేవుళ్లు ఎంత మంది ఉన్నా.. వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి. భద్రపద మాసం మంగళవారం నుంచి.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి. ఇప్పటికే వినాయకుడి ప్రతిష్టించేందుకు ఊరు వాడా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా అంతా గణపతి బొప్ప మోరియా అంటూ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు.
భద్రపద శుద్ద చతుర్థి పర్వదినం సందర్బంగా వినాయకుడికి ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలనే విషయంపై శాస్త్ర పండితులు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అవేమంటే..
మేషరాశి: వినాయకుడికి పూజ చేసే సమయంలో.. ఈ రాశి వారు బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరంతోపాటు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎర్రగులాబీలతో విఘ్నేశ్వరుడిని పూజించాలి. పూజా సమయంలో మాత్రం ఓం వక్రతుండాయ నమ: అనే మంత్రాన్ని జపించాలి. అదే విధంగా ఈ రాశి వారు.. ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి.. పూజలు నిర్వహిస్తే.. సర్వ శ్రేష్టం. ఇక విగ్రహాన్ని ఎరుపు లేదా సింధూరం రంగు వస్త్రాలతో అలంకరించాలి.
వృషభరాశి: వినాయకుడిని తెల్లటి పూవ్వులతో పూజించాలి. ఈ సమయంలో విఘ్నేశ్వరుడికి కొబ్బరి లడ్డులు. మోదకం నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని 11 లేదా 28 సార్లు జపించాలి. ఈ రాశి వారు నీలి రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. తెల్లటి వస్త్రాలను అలంకరించాలి.
మిథునరాశి: వినాయకుడిని దర్బలతో పూజించాలి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడికి మూంగ్ లడ్డు, తమలపాకులు, పచ్చి యాలకలు, ఆకుపచ్చ పండ్లతోపాటు డ్రైప్రూట్స్‌ని నైవేద్యంగా స్పమర్పించాలి. పూజా సమయంలో ఓం శ్రీ గం లక్ష్మీనారాయణ నమ: అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వాళ్లు ఆకుపచ్చ రంగులోని గణేశుడిని పూజించాలి. ఆయనకు ఆకు పచ్చని వస్త్రాలతో అలంకరించాలి.
కర్కాటక రాశి: వినాయకుడిని గులాబీలతో పూజించాలి. పూజ సమయంలో బియ్యం పాయసం, వెన్న, మోదకం నైవేద్యంగా సమర్పించాలి. ఓం ఏకదంతాయ హుం నమ: అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వారు తెల్లటి రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి.
సింహరాశి: వినాయకుడిని గన్నేరు పూలతో పూజించాలి. పూజ సమయంలో.. స్వామి వారికి బెల్లం లేదా బెల్లంతో తయారు చేసిన మిఠాయిలతోపాటు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించాలి. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతేయ వరవరదం సర్వజనం మే వశమానాయ స్వాహా అనే మంత్రాన్ని పటించాల్సి ఉంది. ఈ రాశి వారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఎర్రని వస్త్రాలతో స్వామి వారిని పూజించాలి.
కన్యారాశి: వినాయకుడిని దర్బలతో పూజించాలి. పూజలో స్వామి వారికి ఆకు పచ్చ రంగు పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండు ద్రాక్ష, డ్రై ప్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి. ఓం గం గణపతియే నమ:, ఓం శ్రీం శ్రియ నమ: అనే మంత్రాలు పఠించాలి. ఆకుపచ్చని వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి.
తులరాశి: వినాయకుడిని తెలుపు రంగు పూలతో పూజించాలి. గణపతికి లడ్డూలు, అరటి పళ్లు, పరిమళం, నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి. ఓం హ్రీం, గ్రీం, హీం విఘ్నేశ్వరాయ నమ: అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వారు తెలుపు, నీలం రంగు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. తెల్లని వస్త్రాలతో అలంకరించాలి.
వృశ్చికరాశి: వినాయకుడిని ఎర్ర గులాబీలతో పూజించాలి. పూజలో బెల్లం, లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ నైవేద్యంగా సమర్పించాలి. ఓం హ్రీం ఉమాపుత్రాయ నమ: మంత్రాన్ని చదవాలి. ఈ రాశి వారు ఇంట్లో ఎర్రపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఎరుపు, కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి.
ధనుస్సురాశి: వినాయకుడిని పసుపు పూలతో పూజించాలి. పూజలో పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. హరిద్రరూప హుం గం గ్లౌం హరిద్రాగణపతియై వరవరద దుష్ట భ్రమణము భయ స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వారు పసుపు రంగు వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి.
మకరరాశి: వినాయకుడిని తెల్లటి పువ్వులతోపాటు సింధూరం కలిపిన మల్లెనూనెతో ఆరాధించాలి. పూజ సమయంలో స్వామి వారికి ఎండు ద్రాక్ష, నువ్వుల లడ్డులు నైవేద్యంగా సమర్పించాలి. ఓం లంబోదరాయ నమ: మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వారు నీలం రంగు గణేశుడుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి.
కుంభరాశి: వినాయకుడిని తెల్లని పూవ్వులతోపాటు సింధూరం కలిపిన మల్లెనూనెతో పూజించాలి. పూజలో ఎండు ద్రాక్ష, ఆకుపచ్చ పండ్లు, బెల్లంతో చేసిన లడ్డూలు నైవేద్యంగా ఉంచాలి. ఓం సర్వేశ్వరాయ నమ: అనే మంత్రాన్ని జపించాలి. నీలి రంగు గణపతిని ప్రతిష్టించి.. అదే రంగు వస్త్రాలతో అలంకరించాలి.
మీనరాశి: వినాయకుడిని ఏ రంగు పూలతో పూజించినా పర్వాలేదు. స్వామి వారికి బేసిన్ లడ్డూ, బాదం, పసుపు రంగు మిఠాయిలు, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడి వద్ద పసుపు బట్టలు పెట్టాలి. ఓం సిద్ది వినాయకాయ నమ: మంత్రాన్ని జపించాలి. ఈ రాశి వారు ముదురు పసుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించి.. పసుపు రంగు వస్త్రాలతో స్వామి వారిని అలంకరించాలి.
ఇవి కూడా చదవండి..
Ganesh Chaturthi: వినాయక చవితికి ఎలాంటి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?
Ganesh Chaturthi 2024: లంబోదరుడి పూజలో 21 రకాల ఆకుల ప్రత్యేకత.. నిమజ్జనం ఎందుకు చేస్తారు
Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..
Ganesh Chaturthi: వినాయకుడి వ్రత కథ.. వింటే కోటి జన్మల పుణ్యం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.