Tulasi Pooja: ఆదివారం తులసి పూజ చేయకూడదా.. నెలలో ఈ రెండు రోజులే నియమం ఎందుకు
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:57 PM
శాస్త్రానుసారం ఇంట్లో తులసి మొక్కను నాటడం, ప్రతిరోజూ నీళ్లు పోయడం పూర్వకాలం నుంచి వస్తున్నదే. అయితే, కొన్ని రోజులు మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయడం నిషేధించబడింది.
తులసిని హిందూమతంలో అత్యంత పవిత్రమైన మొక్కగా పిలుస్తారు. ఇది దాదాపు ప్రతి హిందూ నివాసంలో కనిపిస్తుంది. ఈ మొక్కను పూజించే ఇంట సాక్షాత్తూ లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. తులసిని పూజిస్తే దేవీ అనుగ్రహంతో పాటు విష్ణు మూర్తి అనుగ్రహం కూడా వారిపై ప్రసరింపజేస్తుందని విశ్వాసం. తులసి మన శరీరంలోని సమస్త అనారోగ్యాలను నయం చేయగల శక్తిని కలిగి ఉందని చెప్తారు. ఇందులో ఉండే ఔషధీయ గుణాలకు ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాముఖ్యం ఉంది. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఈ మొక్కకు విశేష ప్రాధాన్యతను ఇచ్చారు.
ఆదివారమే ఎందుకు?
శాస్త్రానుసారం ఇంట్లో తులసి మొక్కను నాటడం, ప్రతిరోజూ నీళ్లు పోయడం పూర్వకాలం నుంచి వస్తున్నదే. అయితే, కొన్ని రోజులు మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయడం నిషేధించబడింది. ఆదివారం, ఏకాదశి రోజుల్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ మొక్కను తాకరాదని కనీసం పూజకోసమైనా నీరుపోయరాదని చెప్తారు. అలా చేస్తే ఆ ఇంట తులసి వాడిపోతుందని నమ్ముతారు.
ఇంట్లోకి ప్రతికూల శక్తులు..
హిందూ ప్రజలు తులసి మొక్కను అన్ని రకాల మతపరమైన, శుభకార్యాలలో ఉపయోగిస్తారు. తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోయడం చాలా ప్రయోజనాలను ఇస్తుందని నమ్ముతారు. అయితే, ఆదివారం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, తులసి దేవి ఆదివారం నాడు శ్రీమహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని, ఈ రోజున ఆమెకు నీటిని సమర్పిస్తే, ఆమె ఉపవాసం భంగం అవుతుందని నమ్ముతారు. ఆదివారం నాడు తులసి మొక్కకు నీటిని సమర్పిస్తే, ప్రతికూల శక్తులు మీ ఇంట్లో ఉంటాయని కూడా నమ్ముతారు. దీని కారణంగా, మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. లక్ష్మీ దేవి కూడా కోపంగా ఉంటుందట.
ఏకాదశి నియమం ఎందుకు..
మత విశ్వాసాల ప్రకారం, తులసి దేవి ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన శాలిగ్రామాన్ని వివాహం చేసుకున్నట్లు చెబుతారు. నిజానికి వీరిద్దరూ దేవ్ ఉథాని ఏకాదశి నాడు అన్ని ఆచార వ్యవహారాలతో వివాహం చేసుకున్నారు. ఈ రోజున కూడా తులసీ దేవీ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందని చెప్తారు. దేవి దీక్షకు భంగం కలిగించకుండా ఏకాదశి నియమాన్ని పాటిస్తుంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN బాధ్యత వహించదు.)
Today Horoscope : ఈ రాశి వారికి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.
Updated Date - Nov 28 , 2024 | 04:58 PM