కొల్లి మోహన్‌రావుకు ‘బొప్పన’ పురస్కారం
ABN, Publish Date - Dec 19 , 2024 | 01:57 AM
తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటకరంగ నట, దర్శకులకు, విశేషించి నాటకాభిమానులకు చిరపరిచితులు డా. కొల్లి మోహనరావు. బతుకుతెరువు కోసం హిందీ భాషను ఎంచుకుని, ఉన్నత విద్యకోసం...
తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటకరంగ నట, దర్శకులకు, విశేషించి నాటకాభిమానులకు చిరపరిచితులు డా. కొల్లి మోహనరావు. బతుకుతెరువు కోసం హిందీ భాషను ఎంచుకుని, ఉన్నత విద్యకోసం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. తన అభిరుచి సఫలీకృతం చేసుకోవడానికి, అప్పుడే ఏయూలో వెలసిన థియేటర్ ఆర్ట్స్‌లో సాయంత్రం కోర్సులో చేరారు. గిడుతూరి సూర్యం సాహచర్యంతో ఆయనలో నటవికాసం పెంపొందింది. ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో 30 నాటికలకు దర్శకత్వం వహించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ కళాశాలల స్థాయి ఉత్తమ అధ్యాపకునిగా, 2012లో ‘కందుకూరి రంగస్థల పురస్కారం’లను అందుకున్నారు. 2009లో ఖమ్మంలో జరిగిన నంది నాటకోత్సవాలలో, బాలల నాటిక పోటీలకు, 2017లో నంది నాటకోత్సవాలలో నాటక విభాగంలో ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఎనిమిది పదుల వయసులోనూ,
నిరంతరం సాంఘిక నాటక వికాసం కోసం పరితపించే నాటక శ్రేయోభిలాషి ఆయన. వీరికి అనకాపల్లిలోని ‘కళావిపంచి’, ‘తెలుగు డ్రామా’, ‘జార్జి క్లబ్’ల ఆధ్వర్యంలో జరుగుతున్న నాటకోత్సవాలలో భాగంగా, డిసెంబరు 21న బొప్పన ఆత్మీయ పురస్కారం అందజేస్తున్నారు.
బి.వి. అప్పారావు
Updated Date - Dec 19 , 2024 | 01:57 AM