ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పద పోదాం పుస్తకాల పర్వానికి!

ABN, Publish Date - Dec 19 , 2024 | 02:06 AM

అక్షరాల ఆకురాయితో మదిని పదును పెడుతుంది పుస్తకం దోపిడేదో ధర్మమేదో ఎరుక చేస్తుంది రైతు చేతిలో నాగళ్లున్నట్లు గొర్లకాపరి చేతిలో చిప్పగొడ్డలున్నట్లు...

అక్షరాల ఆకురాయితో

మదిని పదును పెడుతుంది

పుస్తకం

దోపిడేదో ధర్మమేదో ఎరుక చేస్తుంది

రైతు చేతిలో నాగళ్లున్నట్లు

గొర్లకాపరి చేతిలో చిప్పగొడ్డలున్నట్లు

కూలితల్లి చేతిలో కొడవలున్నట్టు

కార్మికుడి చేతిలో సుత్తె పలుగు పారున్నట్లు

నదినిండా అలలున్నట్లు

మనిషి చేతిలో పుస్తకం

మనసు నిండా పొంగి పొరలిన అక్షరాలు

పద్యం పాట, కవిత కథ నవల నాటకాలు

నాయన చిందించిన శరీరపు స్వేదాలు

అమ్మగీసిన బతుకు చిత్రాలు

ప్రేమను సాధించాలన్నా

సమతా మమతలు ప్రభవించాలన్నా

రాజ్యాన్ని నిలబెట్టుకోవాలన్నా

కట్టుబాట్ల కంచెలను త్రుంచేసేదే పుస్తకం

కాలానికీ కార్తికీ పండగున్నట్లు

నదికీ నాగలికీ పండగున్నట్లు

బతుకుకు బతుకమ్మకూ పండగున్నట్లు

బోనానికి బొడ్రాయికీ పండగున్నట్లు

ఆయుధానికి అమ్మోరుకు పండగున్నట్లు

పుస్తకానికీ పండగుంటది

సాలుకోసారి పుస్తకాల జాతరుంటది

పుస్తకాన్ని చదివితేనే విజ్ఞానం

వడివడిగా పోదాం పదా పుస్తకాల పర్వానికి!

వనపట్ల సుబ్బయ్య

(నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్)

Updated Date - Dec 19 , 2024 | 02:06 AM