ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Democracy : మరో విజయం ‘మంత్రులతో ముఖాముఖి’!

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:09 AM

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే అత్యంత కీలకమైనవి, పార్టీ విధివిధానాలు, వారి సమర్థత, పనితీరు వంటి వాటి ఆధారంగానే ప్రజలు వారిపై విశ్వాసం ఉంచుతారు, గెలిపించి ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వాల ఏర్పాటు అనంతరం సైతం క్షేత్రస్థాయిలో ప్రజావసరాలు,

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే అత్యంత కీలకమైనవి, పార్టీ విధివిధానాలు, వారి సమర్థత, పనితీరు వంటి వాటి ఆధారంగానే ప్రజలు వారిపై విశ్వాసం ఉంచుతారు, గెలిపించి ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వాల ఏర్పాటు అనంతరం సైతం క్షేత్రస్థాయిలో ప్రజావసరాలు, ఇబ్బందులు ఎప్పటికప్పుడు అధికార వ్యవస్థతో సమానంగా అధికార పార్టీ కార్యకర్తలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అప్పుడే ఆ ప్రభుత్వం ప్రజాపాలనను అందించగలుగుతుంది. ఈ దిశగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓ విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.

ఏకకాలంలో రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ సహా, ఆరుగ్యారంటీల అమలుతో పాటు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చేదిశగా కృషి చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ. ఇదే సమయంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులనూ రంగంలోకి దించింది. ప్రజాస్పందన, కష్టనష్టాలను తెలుసుకోవడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో వారానికి ఒకరోజు నిర్వహిస్తున్న ‘మంత్రులతో ముఖాముఖి’ ఓ వినూత్న కార్యక్రమం. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందనే పేరు కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. అట్టడుగు స్థాయి నుండి పార్టీలో పనిచేసి, పీసీసీ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే మంత్రులను పార్టీ ఆఫీసుకు పిలిపించి వారితో నేరుగా ఈ ముఖాముఖి ఏర్పాటు చేయించారు. పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు మంత్రులను కలిసి తమ సమస్యలను విన్నవించుకొని వాటికి సత్వర పరిష్కారాలను పొందుతున్నారు.


ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండే ప్రభుత్వపరంగా గతంలో ఇనుప కంచెలతో లోపలికి పోవడానికే వీలులేని అధికార దర్పాన్ని కంచెలు బద్దలుగొట్టింది. అంతేకాకుండా ఏ స్థలమైతే సామాన్యులకు ప్రవేశం లేకుండా నిషేధింపబడిందో ఆ ప్రజాభవన్‌లోనే సామాన్యుల గోడు వినడానికి ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి అనే కార్యక్రమం జరుగుతోంది. కాబినెట్ ర్యాంకుగల చిన్నారెడ్డికి ఈ బాధ్యతను అప్పజెప్పడమే కాకుండా ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించి ప్రజా విన్నపాలను సత్వరంగా పరిష్కరిస్తోంది. అదే ఒరవడిలో ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రుల సమయాలను సామాన్య కార్యకర్తకు సైతం అందించాలనే సత్సంకల్పంతో ప్రతీ బుధవారం హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తమ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా, అటు తమ పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ పక్షాన ఏం చేయాలి, ఏం కావాలి అనే విషయాలను అత్యున్నత శ్రేణి నేతలకు చెప్పుకొనే అవకాశం దీనిద్వారా కలుగుతోంది. మూడునెలలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయి. మంత్రి దామోదర రాజనర్సింహతో మొదలైన ముఖాముఖి కార్యక్రమంలో ఇప్పటివరకూ మంత్రు లందరూ హాజరై సమస్యలను సావధానంగా విన్నారు, వింటున్నారు. సత్వర పరిష్కారాలకై ఉన్నతాధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. సరాసరిన ప్రతీ ముఖాముఖిలో రెండు వందల చొప్పున వందలాది అర్జీలను మంత్రులు ఇప్పటివరకూ స్వీకరించారు. వీటిలో సింహభాగం పరిష్కారం పొందాయి. ప్రజల నుంచి వచ్చే ప్రతీ అర్జీని ఆన్‌లైన్‌ చేయడంతో పాటు పరిష్కారం కోసం వివిధ దశల్లో ఉన్నవాటిని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో ఫాలో అఫ్ చేసుకుంటూ ఫిర్యాదుదారులకు ప్రత్యేకంగా వాటి స్టేటస్‌ను సైతం కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం తెలియజేస్తున్నది. అర్జీదారులు మంత్రులను కలువడానికి సైతం నిర్దిష్ట విధానాలను అమలు చేస్తున్నది. ముందుగా సమూహాలుగా వచ్చిన అసోసియేషన్లు, యూనియన్లు, సంఘాలకు, తదనంతరం వ్యక్తిగతంగా వచ్చినవారికి అవకాశం కల్పిస్తున్నది. ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని, నాయకత్వాన్ని అభినందించాలి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న రేవంత్‌రెడ్డి మంత్రివర్గాన్ని ప్రశంసించాలి.

బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి

సీఈవో, టి–సాట్ నెట్‌వర్క్‌

Updated Date - Dec 21 , 2024 | 03:09 AM