BSF: 144 పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్.. ఖాళీల సంఖ్య, అర్హత ఇదే
ABN, Publish Date - May 19 , 2024 | 08:49 PM
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 19న ప్రారంభమైంది. గడువు జూన్ 17తో ముగుస్తుంది. మొత్తం 144 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
BSF రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ASI (ఫిజియోథెరపిస్ట్) - 47
అర్హత: సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత, ఫిజియోథెరపీలో డిగ్రీ/డిప్లొమాతోపాటు 6 నెలల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20-27 సంవత్సరాలు
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) ల్యాబ్ - 38
అర్హత: మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమాతో పాటు సైన్స్ స్ట్రీమ్‌తో 10+2 ఇంటర్మీడియట్
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇన్‌స్పెక్టర్ లైబ్రేరియన్ - 2
అర్హత: దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
సబ్ ఇన్‌స్పెక్టర్ SI స్టాఫ్ నర్సు - 14
అర్హత: జనరల్ నర్సింగ్‌లో డిగ్రీ/డిప్లొమాతో 10+2 (ఇంటర్మీడియట్)
వయోపరిమితి: దరఖాస్తుదారులు తప్పనిసరిగా 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ఐ వెహికల్ మెకానిక్ - 03
అర్హత: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిగ్రీ/డిప్లొమా
వయోపరిమితి: దరఖాస్తుదారులు తప్పనిసరిగా 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
కానిస్టేబుల్ టెక్నికల్(OTRP, SKT, ఫిట్టర్, కార్పెంటర్, ఆటో ఎలెక్ట్, వెహ్ మెచ్, BSTS) - 34
అర్హత: 10 వ తరగతి, ఐటీఐ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో 3 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
హెడ్‌కానిస్టేబుల్(వెటర్నరీ)- 04
అర్హత: ఒక సంవత్సరం వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సుతో పాటు 10+2 (ఇంటర్మీడియట్ పరీక్ష),1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
కానిస్టేబుల్ కెన్నెల్మాన్ - 02
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ, జీతం తదితర వివరాలను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు.
For More Education News and Telugu News..
Updated Date - May 19 , 2024 | 09:02 PM