ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్స్ రీ షెడ్యూల్..కొత్త తేదీలివే

ABN, Publish Date - Jan 05 , 2024 | 03:02 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. వాస్తవానికి ఆయా విద్యార్థుల పరీక్షల గురించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా..తాజాగా పలు సెబ్జెక్టుల తేదీలను CBSE రీ షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. వాస్తవానికి ఆయా విద్యార్థుల పరీక్షల గురించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా..తాజాగా పలు సెబ్జెక్టుల తేదీలను CBSE రీ షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సవరించిన తేదీలకు సంబంధించిన సమాచారాన్ని బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inని సందర్శించి సవరించిన తేదీ షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.


CBSE కొత్తగా మార్చిన పరీక్షల తేదీలు 2024

మార్చి 4, 2024న జరగాల్సిన 10వ తరగతి టిబెటన్ పేపర్ ఫిబ్రవరి 23న రీషెడ్యూల్ చేయబడింది. ఇక ఫిబ్రవరి 16న జరగాల్సిన టిబెటన్ పేపర్ ఇప్పుడు ఫిబ్రవరి 28, 2024న నిర్వహించబడుతుంది. 10వ తరగతి రిటైల్ పరీక్ష ముందుగా ఫిబ్రవరి 16న జరగాల్సి ఉండగా..ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అదేవిధంగా 12వ తరగతికి సంబంధించి మార్చి 11న జరగాల్సిన ఫ్యాషన్ స్టడీస్ ఎగ్జామ్ మార్చి 21, 2024కి మార్చబడింది.

ఇక CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13, 2024 వరకు జరగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు కొనసాగుతాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి. మరికొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తవుతాయి.

Updated Date - Jan 05 , 2024 | 03:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising