ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diksuchi: ఈఎస్‌సీఐలో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

ABN, Publish Date - Jul 21 , 2024 | 03:27 AM

హైదరాబాద్‌-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఈఎ్‌ససీఐ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఈఎ్‌ససీఐ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌కు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ఎల్‌ అండ్‌ టీ, కార్వే, డెలాయిట్‌, టెక్‌ మహేంద్ర తదితర ప్రముఖ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్‌ కల్పించేందుకు సహకారం అందిస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు

  • ప్రోగ్రామ్‌లో భాగంగా విభాగానికి నిర్దేశించిన ప్రకారం మేజర్‌, మైనర్‌ ఎలక్టివ్‌ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, టెలీకాం అండ్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ అనే మైనర్‌ ఎలక్టివ్‌ సబ్జెక్టులు ఉంటాయి.

  • జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో హెచ్‌ఆర్‌ఎం, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో సివిల్‌, పవర్‌, టెలీకాం, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐటీ; ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీ సేఫ్టీ, సర్వీస్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సెక్టర్‌ సేఫ్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ అనే మేజర్‌ ఎలక్టివ్‌ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన మేరకు ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌/మేనేజ్‌మెంట్‌/ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్‌/మ్యాట్‌/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్‌/ఐసెట్‌ అర్హత పొంది ఉండాలి.

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.5,30,000

దరఖాస్తు ఫీజు: రూ.1,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌:esci.edu.in

Updated Date - Jul 21 , 2024 | 03:27 AM

Advertising
Advertising
<