RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:29 PM
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్(RRCB) ఈ లింక్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ లింక్ క్లిక్ చేసి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమై.. అక్టోబర్ 13న ముగుస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి దరఖాస్తుదారు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 13న ముగుస్తుంది.
రిక్రూట్‌మెంట్ వివరాలు..
మొత్తం ఖాళీలు: 11,558 పోస్టులు
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 8,113 పోస్టులు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736 పోస్టులు
స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు
గూడ్స్ రైలు మేనేజర్: 3,144 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 పోస్టులు
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 3,445 పోస్ట్‌లు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 250 కాగా, మిగతా వారందరూ రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరైన తర్వాత ఫీజులో కొంత భాగం తిరిగి చెల్లిస్తారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలనుకుంటే తరచూ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి.
For Latest News and National News Click Here
Updated Date - Sep 09 , 2024 | 05:29 PM