ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IBPS RRB 2024: 10 వేల ఉద్యోగాలకు నేడు లాస్ట్ డేట్..అప్లై చేశారా

ABN, Publish Date - Jun 27 , 2024 | 08:05 AM

బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date).

IBPS RRB 9995 Posts last date apply

బ్యాంక్‌లో ఉద్యోగం(bank jobs) చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024 jobs) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date). ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ అంటే క్లర్క్, స్టాఫ్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

జూన్ 7 నుంచి జూన్ 27, 2024 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఇక్కడ క్లిక్ చేసి IBPS వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తు తేదీ గడువు పెంచే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఈ క్రమంలో అభ్యర్థులు ఈరోజే అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి.


దరఖాస్తు ఫీజు

ఈ పోస్టులకు అప్లై చేయాలంటే మీరు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైతే చాలు. దరఖాస్తు రుసుము(fees) జనరల్, OBC, EWS వర్గాలకు రూ. 875. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు దరఖాస్తు రుసుము రూ. 175. దరఖాస్తు రుసుములను ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు(age) కాగా గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలుగా ఉంది. రిజర్వ్‌డ్ కేటగిరీ స్త్రీ, పురుష అభ్యర్థులకు దరఖాస్తు చేయడానికి గరిష్ట వయస్సులో ప్రత్యేక సడలింపు ఉంటుంది.


వేతనం

ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహిస్తోంది. IBPS RRBలో ఎంపిక కోసం అభ్యర్థులు రెండు పరీక్షలకు అర్హత సాధించాలి. మొదట ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్ ఎగ్జా్మ్ ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడుతుంది. RRB గ్రామీణ బ్యాంక్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో ఉంటుంది.

మెయిన్స్ సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహిస్తారు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన తర్వాత గ్రామీణ బ్యాంకుల్లో నియమితులైన అభ్యర్థులకు నెలవారీ జీతం(salary) 40,000 నుంచి 45000 వరకు ఇవ్వబడుతుంది.


ఇవి కూడా చదవండి

LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక


Gold and Silver Rates Today: గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


For More Education News and Telugu News..

Updated Date - Jun 27 , 2024 | 08:16 AM

Advertising
Advertising