ABN Big Debate: తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి, జాదూ: సీఎం రమేష్
ABN, Publish Date - Apr 22 , 2024 | 07:52 PM
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమిత్ షా, నరేంద్ర మోదీ మనసును అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ చూరగొన్నారు. సీఎం రమేష్ తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కన్విన్స్ చేయగల శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చారని సమాధానం ఇచ్చారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో (CM Ramesh) ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ నిర్వహించారు. అమిత్ షా, నరేంద్ర మోదీ మనసును అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ చూరగొన్నారు. సీఎం రమేష్ తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కన్విన్స్ చేయగల శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చారని సమాధానం ఇచ్చారు. మొత్తానికి మీరు పెద్ద జాదూ అనగా.. మీరెమన్న అనుకోవచ్చని సీఎం రమేష్ ఆన్సర్ ఇచ్చారు. జాదు పనికి సంబంధించి ఓ ఉదహరణను వివరించారు. పార్లమెంట్‌లో 370 బిల్లు వచ్చింది. 5 సార్లు రాజ్యసభ, అసోంకు రెండుసార్లు పీసీసీ ప్రెసిడెంట్, ఒకసారి లోక్ సభ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నేతను ఒప్పించానని వివరించారు. అతను తమతో ఉంటే బాగుంటుందని అమిత్ షా చెబితే మాట్లాడి ఒప్పించానని వివరించారు. తన కుమారుడి పెళ్లిలో రమేష్ నీకు మాట ఇచ్చాడు.. నీ పని జరిగింది. నీకు రాజ్యసభ వచ్చిందని ఆ నేతతో మన్మోహన్ సింగ్ లాంటి వారన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజ్యసభ వచ్చేది కాదని మన్మోహన్ లాంటి వారు అన్న విషయాన్ని రమేష్ వివరించారు.
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 22 , 2024 | 08:58 PM