AP Election 2024: కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ.. విషయం ఏంటంటే?
ABN, Publish Date - May 22 , 2024 | 06:30 PM
ఏపీలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసపై దర్యాప్తునకు నియమించిన సిట్ దర్యాప్తు సరిగ్గా జరగలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని, ఏపీలో అల్లర్లు, అలజడులను ఆపడంలో సీఎస్ విఫలమయ్యారని పేర్కొంది.
తిరుపతి: ఏపీలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసపై దర్యాప్తునకు నియమించిన సిట్ దర్యాప్తు సరిగ్గా జరగలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని, ఏపీలో అల్లర్లు, అలజడులను ఆపడంలో సీఎస్ విఫలమయ్యారని పేర్కొంది.
డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదని ఈసీని జనసేన ప్రశ్నించింది. సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని జనసేన అనుమానాలు వ్యక్తం చేసింది. అందుకే జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
జవహర్ రెడ్డి నిన్న (మంగళవారం) వైజాగ్‌కు రహస్యంగా ఎందుకు వెళ్లారో తెలియడంలేదని కిరణ్ రాయల్ సందేహం వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సరిగ్గా లేదని, పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో అమాయకులను అరెస్టు చేశారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Updated Date - May 22 , 2024 | 06:30 PM