ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

ABN, Publish Date - May 10 , 2024 | 07:37 AM

‘‘రాయల సీమలో వైసీపీ బలంగా ఉంది. దౌర్జన్యాలు చేసినా మన ఎస్‌హెచ్‌వోలే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. పొరుగు రాష్ట్రాలకు చెందిన బలగాలను ఇక్కడ పెడితే వారు స్థానిక ఎస్‌హెచ్‌వోలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, లూప్‌లైన్‌ విభాగాల్లో ఉన్న వారిని మాత్రం ఇటు రానీయొద్దు. అక్కడున్నది అధికార పార్టీపై అసంతృప్తులు. వారితో ఇబ్బంది’’- ఇదీ వైసీపీ వీరభక్త ఉన్నతస్థాయి పోలీసు అధికారుల మధ్య గత నెలలో జరిగిన చర్చ.

జగన్‌ వీరభక్త పోలీసు అధికారుల ఎత్తుగడ

ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రకు లూప్‌లైన్‌ సిబ్బంది

సీమకు పొరుగు పోలీస్‌.. రాజధాని జిల్లాల్లో మనోళ్లే

ఈ కుట్రను కొత్త డీజీపీ పసిగట్టి సరిదిద్దుతారా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘రాయల సీమలో వైసీపీ బలంగా ఉంది. దౌర్జన్యాలు చేసినా మన ఎస్‌హెచ్‌వోలే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. పొరుగు రాష్ట్రాలకు చెందిన బలగాలను ఇక్కడ పెడితే వారు స్థానిక ఎస్‌హెచ్‌వోలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, లూప్‌లైన్‌ విభాగాల్లో ఉన్న వారిని మాత్రం ఇటు రానీయొద్దు. అక్కడున్నది అధికార పార్టీపై అసంతృప్తులు. వారితో ఇబ్బంది’’- ఇదీ వైసీపీ వీరభక్త ఉన్నతస్థాయి పోలీసు అధికారుల మధ్య గత నెలలో జరిగిన చర్చ.

ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీని గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్న కీలక అధికారులు సమావేశమై పలు వ్యూహాలు పన్నే క్రమంలో ఈ ఆసక్తికర అంశాన్ని ఇతర పోలీసులు పసిగట్టారు. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ కీలకం కావడంతో బలగాల మొహరింపులో కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎక్కడికక్కడ ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఎలాగైనా గెలవాలని చూస్తున్న వైసీపీకి కలిసి వచ్చేలా అధికార పార్టీ బలంగా ఉన్న చోట ఒక విధంగా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో మరోలా బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

రాయలసీమ జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా కర్నూలు, కడప, చిత్తూరులలో తాము బలంగా ఉన్నట్లు వైసీపీ విశ్వసిస్తోంది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బలంగా పోటీ ఇచ్చే చోట అల్లర్లు చేసైనా గెలిచేందుకు కుట్ర చేసినట్లు రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి కుట్రలకు బలం చేకూర్చేలా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే పోలీసు బలగాలను రాయల సీమ జిల్లాల్లో మోహరించారు.


దీంతో అక్కడ ఎలాంటి ఉల్లంఘనలు చేసినా పొరుగు రాష్ట్రాల పోలీసులకు అర్థం కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ అనుకూల పోలీసులే సరిపడా ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర బలగాలు కూడా కొన్ని వచ్చాయి. ఈ జిల్లాల్లో పూర్తి ఏకపక్షంగా ఉన్న నియోజకవర్గాలను వదిలేసి ‘నువ్వా నేనా’ అన్నట్టుగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం వీలైనంత మేర అక్రమాలు చేసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంలో గతంలో హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు గట్టిగా పనిచేసేందుకు ప్రయత్నించినా.. ఇప్పటి వరకు అక్కడున్న లోకల్‌ పోలీసు అధికారులతో కుట్ర అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు పూర్తిగా లూప్‌లైన్‌ విభాగాల సిబ్బందిని ఎన్నికల విధుల్లో దించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఏసీబీ, ఎస్‌పీఎఫ్‌, ఏపీఎస్పీ, సీఐడీ, జీఆర్‌పీ, పీటీసీ, ఆర్టీసీ, అగ్నిమాపక, ఎర్రచందనం యాంటీ ఫోర్స్‌ తదితర విభాగాల నుంచి 2,598 మంది సిబ్బందిని ఎన్నికల విధుల కోసం తీసుకున్నారు.

వారిని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాకుండా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే మోహరించారు. దీనికి కారణం అక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉండటమేనని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. శాంతి భద్రతల విభాగంలో ఉన్న పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా పనిచేస్తుంటే లూప్‌లైన్‌ విభాగాల్లో ఉన్న వారు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఎన్నికల విధుల నుంచి దూరమైన పోలీసు ఉన్నతాధికారులే ఈ స్కెచ్‌ వేసినట్టు చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ దీనిని పసిగట్టి సరిదిద్దుతారా? లేక సమయం లేదని ఊరుకుంటారా.. అనేది చూడాలని సీనియర్‌ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 08:13 AM

Advertising
Advertising