ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health: ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్.. మనసు అదుపు తప్పదు!

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:05 PM

మనపై మనకు నియంత్రణ ఏర్పడి సంతోషంగా జీవించేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.

ఇంటర్నెట్ డెస్క్: మనసు చేసే గారడీలు అన్నీ ఇన్నీ కావు. కొందరి మనసు ప్రతికూల భావనలతో నిండిపోతే మరికొందరి మనసు చంచలంగా ఉంటూ పనిపై దృష్టి పెట్టనివ్వదు. కొందరేమో నిత్యం అతిగా ఆలోచిస్తూ ఏదో చెడు జరగనుందని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలా కోతిలా కుప్పి గంతులేసే మనసు వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేక, లక్ష్యాలు చేరుకోలేక అపజయాలు మూటగట్టుకుంటారు (Mental Health). చివరకు తామెందుకూ పనికిరామనే భావనలో కూరుకుపోతారు. అయితే, ఈ వలయం నుంచి బయటపడేందుకు మానసిక శాస్త్రవేత్తలు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటో ఓసారి చూద్దాం (Powerful techniques to keep away unwanted thoughts).

Cotton buds: కాటన్ బడ్స్ వాడుతున్నారా? మీరు తెలీక చేస్తున్న తప్పు ఇదే!


నిత్యం వాస్తవంలో బతకాలి. చిన్న పని చేస్తున్నా పెద్ద పని చేస్తున్నా మనసు దానిపైనే లగ్నం చేయాలి. ఏ పనీ లేకపోతే చుట్టూ ఉన్న పరిసరాలపై దృష్టిపెడుతూ ఉండాలి. ఇలా మనసును బిజీగా ఉంచితే అది కట్టుతప్పదు. రాను రాను ఈ స్థితి అలవాటై ఏకాగ్రత అలవడుతుంది. దీన్నే మైండ్‌ఫుల్‌నెస్ అంటారు.

మనసు మాట విననప్పుడు పలుమార్లు గట్టిగా ఊపిరి తీసుకుని వదలడం, చుట్టు ఉన్న పరిసరాలపై దృష్టి మళ్లించడం, మనకేం కాదు అని పదే పదే మననం చేసుకుంటే ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆలోచనలు క్షణాల్లో నెమ్మదిస్తాయి. మనసు శాంతిస్తుంది.

మనసు అదుపు తప్పుతున్నప్పుడు 5-4-3-2-1 చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మనం పరిసరాల్లో చూడగలిగిన ఐదు వస్తువులు, చేతితో తాకగలిగిన నాలుగు వస్తువులు, వినగలిగిన మూడు శబ్దాలు, వాసన ఆఘ్రాణించగలిగి రెండు వస్తువులు, రుచి చూడగలిగిన ఫుడ్ ఏదో గుర్తించాలి. దీంతో, వెంటనే ఆలోచనలు కుదుటపడి మనసు వెంటనే నియంత్రణలోకి వస్తుంది.

శ్వాసపై దృష్టి పెడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శ్వాసపైనే మనసును కేంద్రీకరిస్తూ పలుమార్లు గాలి పీల్చి వదిలితే తక్షణ ఫలితం ఉంటుంది. అయితే, ఊపిరి తీసుకునే వేగాన్ని నియంత్రించేందుకు అతిగా శ్రమపడొద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. సహజసిద్ధమైన రీతిలో ఊపిరితీసుకుని వదలాలని చెబుతున్నారు.

ప్రతి రోజు ఓ షెడ్యూల్ వేసుకుని దాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తే అతిగా ఆలోచించడం కొంచెం తగ్గుతుంది. అంతిమంగా ఇది మనసుకు నిలకడను ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను దరి చేరనివ్వదు.


మనసులో వచ్చే ఆలోచనలకు అక్షరం రూపం ఇవ్వడం కూడా సాంత్వన కలిగిస్తుంది. దీంతో, ఆలోచనలపై స్పష్టత ఏర్పడి ఊరట లభిస్తుంది.

నిత్యం ధ్యానం ద్వారా మనసుకు నిలకడ తెచ్చుకోవచ్చు. అయితే, ధ్యానం చేసేటప్పుడు మనసులో వచ్చే ఆలోచనలపై స్పందించకుండా తటస్ఠ ప్రేక్షకుడిలా నిర్లిప్తంగా గమనిస్తూ ఉంటే క్రమంగా మనసుపై పట్టు చిక్కుతుంది. మనపై మనకు అదుపు ఏర్పడుతుంది.

ఆధ్యాత్మికత అలవర్చు కోవడం కూడా మనసుపై అదుపును చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read Health and Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 07:13 PM

Advertising
Advertising