AC Side Effects: ఉక్కపోత తప్పించుకోవచ్చని ఏసీ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? మీకు ఈ ముప్పులు తప్పవు..!
ABN , Publish Date - Jun 03 , 2024 | 01:42 PM
వేసవి వేడి భరించలేక చాలామంది ఏసీలు, కూలర్లకు అతుక్కుపోతారు. చాలా ఇళ్లలోనూ, ఆఫీసులలోనూ ఏసీలను 24 గంటలూ వినియోగిస్తుంటారు. అయితే ఏసీలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గదులు చల్లగా కావడం మాట అంటుంచితే కలిగే ముప్పు మాత్రం పెద్దదే..

వేసవి కాలంలో ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వేసవి వేడి భరించలేక చాలామంది ఏసీలు, కూలర్లకు అతుక్కుపోతారు. చాలా ఇళ్లలోనూ, ఆఫీసులలోనూ ఏసీలను 24 గంటలూ వినియోగిస్తుంటారు. అయితే ఏసీలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గదులు చల్లగా కావడం మాట అంటుంచితే ఆరోగ్యానికి మాత్రం ముప్పు తప్పదని అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా ఏసీ ని ఎక్కువగా వినియోగించడం వల్ల శ్వాస సమస్యలు, చర్మ సంబంధ సమస్యల ముప్పు తప్పదట. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే..
ఏసీ గాలికి ఎక్కువసేపు ఎక్స్‌పోజర్ చేయడం వల్ల చర్మం పొడిబారడం,మొదలుకొని తలనొప్పి, పొడి దగ్గు, తల తిరగడం, వికారం, ఏకాగ్రత, అలసట, వాసన గ్రహించలేక పోవడం వంటి అనేక ఆరోగ్య ప్రమాదాలు వస్తాయి.
6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?
పై లక్షణాలతో పాటు, AC వాడకం అలెర్జీ రినిటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఏసీ సరిగా మెయింటెయిన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎయిర్ కండిషనింగ్‌కు ఎక్కువ కాలం బహిర్గతం కాకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎయిర్ కూలర్లలో ఉండే ఫిల్టర్లు తక్కువ మన్నికైనవిగా ఉంటాయి. చాలా ఖరీదైన ఏసీలలో తప్ప మంచి నాణ్యత కలిగిన ఫిల్టర్లు ఉండవు. ఈ కారణంగా ఈ ఫిల్టర్లు గాలి కాలుష్యానికి కారణం అవుతాయి.
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
కమర్షియల్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు హోమ్ AC సెటప్‌లతో పోలిస్తే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. వేడి వాతావరణం నుండి చల్లని AC గదికి అకస్మాత్తుగా మారడం వలన శ్వాసనాళాల సంకోచం లేదా శ్వాసనాళాలు సంకుచితం కావచ్చు,. ఇది ముఖ్యంగా ఉబ్బసం సమస్య ఉన్న వ్యక్తులకు ప్రమాదకరంగా ఉంటుంది.
ఏసీ తో కలిగే ప్రమాదాలను తగ్గించడానికి AC ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. వెంటిలేషన్ కోసం ప్రతి రెండు గంటలకు ACని స్విచ్ ఆఫ్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.