ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mosquito Repellent: మస్కిటో రిపెలెంట్స్ హానికరమా? వైద్యులు చెప్పిన సమాధానం ఇదే!

ABN, Publish Date - Nov 28 , 2024 | 08:47 PM

మస్కిటో రిపెలెంట్స్ ఆరోగ్యానికి హానికరమా లేక మేలు చేస్తాయా అనే ప్రశ్న అనేక మంది కలిగే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో డా. నాయక్ అనే వైద్యుడు దీనిపై వైద్యులు సవివరమైన సమాధానమే ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: దోమల బెడద లేని చోటు దాదాపు ఉండదనే చెప్పాలి. వీటి పీడ వదిలించుకునేందుకు అనేక మంది విద్యుత్ తో నడిచే మస్కిటో రిపెలెంట్ వేపరైజర్లను వాడతారు. వీటిని ఆన్ చేయగానే వెలువడే పొగ క్షణాల్లో దోమలను తరిమి కొడుతుంది. మరి ఇవి ఆరోగ్యానికి హానికరమా? కాదా? అనే ప్రశ్న అనేక మంది కలిగే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో డా. నాయక్ అనే వైద్యుడు దీనిపై సవివరమైన సమాధానమే ఇచ్చారు (Viral)..

Viral: ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే..


డా. నాయక్ చెప్పే దాని ప్రకారం, ఈ వేపరైజర్లలోని ద్రవంలో ట్రాన్స్‌ఫ్లూత్రిన్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ టౌలీన్, సిట్రొనెల్లాల్, డైమిథైల్, ఆక్టాడయీన్, పారాఫిన్ ఉంటాయి. వీటితో పాటు సువాసన కోసం బెంజైల్ ఎలిటాల్ కూడా కలుపుతారట.

సదరు వైద్యుడు చెప్పే దాని ప్రకారం, ట్రాన్స్‌ప్లూత్రిన్‌తో దడ, ఆందోళన, తుమ్ములు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, స్కిన్ అలర్జీలు, దగ్గు వంటి సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఈ రసాయనాలను కేటగిరీ-2 కార్సినోజెన్లుగా వర్గీకరిస్తారు. అంటే.. వీటితో క్యాన్సర్ కేసులు పెరిగే ప్రమాదం ఎక్కువవుతుంది.

Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!


ఈ రసాయనాలు పిల్లలపై కూడా ప్రభావం చూపుతాయట. వారి రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందట. చిన్నారుల మెదడు ఎదుగుదల కూడా కుంటుపడుతుంది. పెంపుడు కుక్కలు కూడా వీటితో ఇబ్బందులు పడతాయి. వీటిల్లోని అరోమాటిక్ రసాయనాలు చర్మం, శ్వాసకోస సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. ఇక ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేపరైజర్లను ఆన్ చేస్తే ఈ సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు గర్భవతులు, అప్పుడే పుట్టిన బిడ్డలు, చిన్నారులు, వృద్ధులు వేపరైజర్ల వినియోగాన్ని తగ్గించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేపరైజర్లను వినియోగించాల్సి వస్తే కిటికీలు, తలుపులు తెరిచాక వీటిని ఆన్ చేయాలి. తలుపులను కొన్ని నిమిషాల పాటు తెరిచే ఉండాలి.

ఇక దోమలు రాకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలకు స్క్రీన్‌ను వాడటమే మంచిది. ఇంటిముందు నీరు నిలవకుండా, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.

వేపరైజర్లకు బదులు సహజసిద్ధమైన కర్పూరం, లేదా వేప ఆకులను కాలిస్తే దొమల బెడద సులువుగా వదిలించుకోవచ్చు.

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 28 , 2024 | 08:55 PM