ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Baby Food: మీ పిల్లలకు 6 నెలలు నిండాయా? అయితే ఆహారంలో ఇవి చేర్చండి..!

ABN, Publish Date - Jun 15 , 2024 | 11:20 AM

పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు తల్లిపాలు, కుదరకపోతే ఫార్ములా పాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదు పిల్లలకు. కానీ 6నెలలు దాటిన తరువాత మెల్లిగా వారు తినగలిగే, జీర్ణం చేసుకోగలిగే ఆహారాలను చేర్చమని ఆహార నిపుణుల నుండి పిల్లల వైద్యుల వరకు అందరూ సిఫారసు చేస్తారు. ఎందుకంటే..

ఆహారం అందరికీ అవసరమే. అయితే పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు తల్లిపాలు, కుదరకపోతే ఫార్ములా పాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదు పిల్లలకు. కానీ 6నెలలు దాటిన తరువాత మెల్లిగా వారు తినగలిగే, జీర్ణం చేసుకోగలిగే ఆహారాలను చేర్చమని ఆహార నిపుణుల నుండి పిల్లల వైద్యుల వరకు అందరూ సిఫారసు చేస్తారు. దీనికి కారణం 6 నెలలు దాటిన తరువాత పిల్లలకు తల్లిపాలు సరిపోవు. వారికి అదనపు ఆహారం, అదనపు పోషకాలు కూడా కావాలి. 6నెలలు నిండిన పిల్లలకు ఎలాంటి ఆహారాలు ఇవ్వవచ్చు? వాటిని ఎలా ఇవ్వాలి? తెలుసుకుంటే..

మెత్తగా చేసిన అన్నం, కూరగాయలు లేదా క్యారెట్ మొదలైన వాటిని పప్పు నీటిలో ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


ఉడికించిన పప్పులు, అన్నంలో నెయ్యి వేసి పిల్లలకు తినిపించవచ్చు.

ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం కాకుండా విభిన్నంగా ఇవ్వాలి. మొదటి వారంలో కూరగాయలు ఇవ్వవచ్చు. రెండవ వారంలో అన్నం ఇవ్వవచ్చు. ఇవి మాత్రమే కాకుండా అరటి, యాపిల్ మొదలైన పండ్లను మెత్తగా గుజ్జులాగా చేసి కూడా తినిపించవచ్చు. ఇది బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

పిల్లలకు ఒక సంవత్సరం వచ్చేవరకు బయటి పాలు ఇవ్వకూడదు. సంవత్సరం తరువాత బయటి పాలు అంటే ఆవు లేదా గేదె పాలు ఇవ్వవచ్చు.

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


క్యారెట్ ఉడికించి మెత్తని గుజ్జులా చేసి దాన్ని పిల్లలకు ఇవ్వచ్చు, అదే విధంగా సొరకాయ, యాపిల్ మొదలైన వాటిని గుజ్జు చేసి ఇవ్వవచ్చు. వీటితో పాటూ గుడ్లు, చేప పిల్లలకి కొద్దికొద్దిగా అలవాటు చెయ్యవచ్చు.

ముఖ్యంగా ఒక సంవత్సరం వరకు పిల్లలకు ఆహారంలో ఉప్పు లేదా చక్కెర ఇవ్వకూడదు. అంతే కాకుండా నూనె, మసాలాలు కూడా బిడ్డకు మంచిది కాదు.

ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!

జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 15 , 2024 | 11:20 AM

Advertising
Advertising