ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Banana: అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ్..

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:05 PM

అరటిపండ్లను ఆరోగ్యానికి చాలా మేలు చేసేవిగా పరిగణిస్తారు. కానీ మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాగానే తొందరగా పాడవుతుంటాయి. ఈ టిప్స్ తో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Banana

అరటిపండ్లు చాలా మంది ఫేవరెట్ ఫ్రూట్. ఇవి పేదవారికి కూడా అందుబాటు ధరలో ఉంటాయి. ఇక చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అరటిపండును సులువుగా తినగలరు. చాలా మంది రోజూ ఒక అరటిపండు తింటూ ఆరోగ్యం చక్కగా ఉంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఇందుకోసమే అరడజను నుండి డజను పండ్లను కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. కానీ వీటిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత చాలా తొందరగా పాడైపోతాయి. తొందరగా నల్లబడి తినడానికి వీలు కాకుండా అవుతాయి. కానీ 5 టిప్స్ పాటించి అరటిపండ్లు నిల్వ చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

Eye Test: ఈ ఫొటోలో ఉన్న సంఖ్యను 15 సెకెన్లలో గుర్తిస్తే మీ కళ్లు చాలా పవర్పుల్ అని ఒప్పుకోవాల్సిందే..


అల్యూమినియం పాయిల్..

మార్కెట్ నుండి అరటిపండ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాగానే అటిపండ్ల కాండాన్ని అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి నిల్వ చేయాలి. ఇలా చేస్తే అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

హ్యాంగింగ్..

అరటిపండ్లను మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాగానే డైనింగ్ టేబుల్ లేదా కిచెన్ లో కౌంటర్ మీద పెట్టేస్తుంటారు. కానీ ఇలా చేయకుండా అరటిపండ్లను వేలాడదీయాలి. అరటిపండ్ల కాండానికి ఏదైనా తాడు కట్టి దేనికైనా ఆ తాడును వేలాడదీయాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు అరటిపండ్లు నల్లబడకుండా, మెత్తబడకుండా తాజాగా ఉంటాయి.

కలపకూడదు..

పండ్లను అన్నింటిని ఒక్కచోట ఉంచడం చూడానికి బాగానే అనిపిస్తుంది కానీ ఇలా చేయడం వల్ల పండ్లు తొందరగా పాడైపోతాయి. అందుకే యాపిల్, మామిడి వంటి ఇథలీన్ వాయువును విడుదల చేసే పండ్ల నుండి అరటిపండ్లను దూరంగా ఉంచాలి. ఇథలీన్ వాయువు పండ్లను తొందరగా మగ్గేలా చేస్తుంది.

జుట్టు చిట్లుతోందా.. అసలు కారణాలు ఇవే..


ఫ్రిడ్జ్ లో..

చల్లని ఉష్టోగ్రతలు అరటిపండ్లు చెడిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అరటిపండ్లను గది ఉష్టోగ్రత వద్ద పొడి ప్రదేశంలో ఉంచాలి. పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండటంలో ఇది సహాయపడుతుంది.

ఎంపిక..

అన్నింటికంటే ముఖ్యంగా అరటిపండ్ల ఎంపిక కూడా చాలా ముఖ్యం. పండ్లు పూర్తీగా మాగిపోయినవి కాకుండా కాస్త పచ్చగా, గట్టిగా ఉన్న పండ్లను ఎంచుకోవాలి. ఇలాంటి పండ్లను కనీసం నాలుగైదు రోజుల వరకు తినగలుగుతారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..

ఈ పదార్థాలు తిన్న తరువాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 22 , 2024 | 04:05 PM