Belly Fat: అల్లం నీరు లేదా మెంతి నీరు.. పొట్ట కొవ్వు తగ్గడానికి ఏ డ్రింక్ మంచిది?
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:27 PM
పొట్ట తగ్గించుకోవడానికి ట్రై చేసేవారు కూడా ఎక్కువే ఉన్నారు. పొట్ట తగ్గడానికి చాలా రకాల పానీయాలు కూడా ట్రై చేస్తుంటారు. వీటిలో అల్లం నీరు, మెంతినీరుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. అయితే ఈ రెండింటిలో పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏ డ్రింక్ బెస్ట్?
ఈ మధ్య కాలంలో మనుషులు సన్నగా ఉన్నా పొట్ట మాత్రం తప్పనిసరిగా ఉంటోంది. ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఇలా జరుగుతోంది. మరికొందరికి శారరీక వ్యాయామం లేక, ఇంకొందరు పేలవమైన జీవనశైలి కారణంగా కూడా పొట్ట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పొట్ట తగ్గించుకోవడానికి ట్రై చేసేవారు కూడా ఎక్కువే ఉన్నారు. పొట్ట తగ్గడానికి చాలా రకాల పానీయాలు కూడా ట్రై చేస్తుంటారు. వీటిలో అల్లం నీరు, మెంతినీరుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. అయితే ఈ రెండింటిలో పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏ డ్రింక్ బెస్ట్ తెలుసుకుంటే..
Gynecologic Cancer: స్త్రీలు జననేంద్రియాల దగ్గర ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..!
అల్లం నీరు..
అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ముఖ్యంగా జీవక్రియను పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినది. అల్లం నీరు తాగితే కింది ప్రయోజనాలు ఉంటాయి.
అల్లంలో జింజోరోల్స్, పోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి థర్మోజెనిసిస్ ను పెంచుతాయి. ఇది శరీరంలో వేడిని పెంచి కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
అల్లం సాంప్రదాయకంగా జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. బరువు సమర్థవంతంగా తగ్గాలంటే ఆరోగ్యవంతమైన జీవక్రియ చాలా అవసరం. ఇది పోషకాలు సరిగా గ్రహించడంలోనూ, శరీరంలో వ్యర్థాలు తొలగించడంలోనూ సహాయపడుతుంది.
అల్లం ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నియంత్రించడంలో, కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్‌లు ట్రై చేయండి..
మెంతి నీరు..
మెంతి గింజలలో పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో మెంతి నీటిని ఉపయోగిస్తున్నారు. మెంతి నీరు తాగడం వల్ల కింది ఫలితాలు ఉంటాయి.
మెంతి గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే బరువు తగ్గడం సులువు.
మెంతులలో గెలాక్టోమన్నన్ అనే కరికే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును శోషించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట కొవ్వు పేరుకుపోకుండా సమర్థవంతంగా నివారిస్తుంది.
మెంతులు కడుపులో చక్కెర శోషణను మందగించేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియని 5 లక్షణాలు ఇవి..!
ఏది మేలు..
అల్లం నీరు, మెంతి నీరు రెండూ బరువు తగ్గడానికి తోడ్పడేవే..
జీవక్రియను పెంచి ఆకలిని తగ్గించాలని అనుకుంటే అల్లం నీరు మంచిది. అతిగా తినడంతో ఇబ్బంది పడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని అనుకుంటే మెంతి నీరు మంచి ఎంపిక. ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే అల్లం నీరు లేదా మెంతి నీరును తాగుతూ ఉంటే క్రమంగా పొట్ట కొవ్వు తగ్గడంలో సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి..
కుంకుమ పువ్వు గురించి మీకు తెలియని నిజాలివి..!
పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 06 , 2024 | 12:27 PM