ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Black Pepper: వర్షాకాలంలో నల్ల మిరియాలు తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:09 PM

మిరియాలు పొంగలి, రసం వంటి వంటల్లోనూ.. సూపులు, సలాడ్ లలోనూ వినియోగిస్తుంటారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను పరిష్కరించడంలోనూ నల్ల మిరియాలు వంటింటి వైద్యంలో భాగంగా పనిచేస్తాయి.

Black Pepper

మిరియాలు వంటింటి మసాలా దినుల్లో ప్రధాన భాగం. వీటిని మసాలా పొడుల తయారీలోనే కాకుండా పొంగలి, రసం వంటి వంటల్లోనూ.. సూపులు, సలాడ్ లలోనూ వినియోగిస్తుంటారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను పరిష్కరించడంలోనూ నల్ల మిరియాలు వంటింటి వైద్యంలో భాగంగా పనిచేస్తాయి. ఇక ఆయుర్వేదంలో కూడా మిరియాలకు ప్రాధాన్యత ఉంది. వర్షాకాలంలో మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే..

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!


  • నల్లమిరియాలలో పైపెరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాలు బాగా వాడితే మంచిది.

  • సీజన్ మారగానే శరీరంలో జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఆహారంలో మిరియాలను చేర్చుకోవడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. ఎందుకంటే మిరియాలలో జీర్ణక్రియను ప్రోత్సహించే సమ్మేళనాలు ఉంటాయి.

  • ఆహారం సరిగా తీసుకోకపోవడం, విరుద్ద ఆహారాలు తీసుకోవడం, ఆహర నియమాలు పాటించకపోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు మిరియాలు తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. పొట్ట సంబంధిత సమస్యలు తగ్గించడంలో మిరియాలు బాగా పనిచేస్తాయి.

టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!


  • మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. వీటిని వర్షాకాలంలో తీసుకోవడం ముఖ్యం.

  • మిరియాలు వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే వర్షాకాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. శరీరం చురుగ్గా ఉండటంలో కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడాన్ని, శరీరంలో వాపులు తగ్గడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది.

  • వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. మిరియాలను ఆహారంలో భాగం చేసుకుంటే శ్వాస నాళాలు, గొంతు క్లియర్ అవుతాయి. వీటి పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 19 , 2024 | 12:09 PM

Advertising
Advertising
<