Bottle Guard: పొట్ట కొవ్వును ఐస్ లా కరిగించే జ్యూస్ ఇదీ.. రోజూ ఒక్క గ్లాసు తాగితే ఏం జరుగుతుందంటే..!
ABN , Publish Date - Mar 28 , 2024 | 04:18 PM
చాలామంది పొట్ట, బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఈ జ్యూస్ భలే ఉపయోగపడుతుంది.
అనారోగ్య కొవ్వు జబ్బులకు నిలయం. ఇది సకాలంలో తగ్గకపోతే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, స్థూలకాయం, రక్తపోటు వంటి వ్యాధులు సులువుగా వస్తాయి. చాలామంది ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు బరువు పెరిగా, శరీరంలో కొవ్వు పెరిగిందని అనిపించినా డైటింగ్ నుండి వ్యాయామాల వరకు బోలెడు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కొందరు పొట్ట కొవ్వు, అధిక బరువు తగ్గడానికి వివిధ రకాల జ్యూసులు కూడా తాగుతుంటారు. ఇలా బరువు తగ్గించడంలో సహాయపడే కూరగాయలలో సొరకాయ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రతి రోజూ ఒక గ్లాసుడు సొరకాయ రసం తాగితే జరిదేంటో.. సొరకాయలో ఉన్న పోషకాలేంటో తెలుసుకుంటే..
సొరకాయ జ్యూస్..
సొరకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టను ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. పైగా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే సొరకాయ జ్యూస్ ను ఎలాంటి సంకోచం లేకుండా తాగవచ్చు. సొరకాయలో 96శాతం నీరు ఉంటుంది. మిగిలిన భాగం కేలరీలు, ఫైబర్ ఉంటుంది. ఇక ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్-సి, పొటాషియం, ఐరన్, సోడియం కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Dark Neck: మెడ భాగంలో చర్మం నల్లగా మారి ఎబ్బెట్టుగా కనిపిస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!
సొరకాయ రసం తాగితే పూర్తీగా బరువు తగ్గుతారా?
సొరకాయ రసం తాగడం వల్ల బరువు తగ్గడం మాట నిజమే అయినా ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఒక భాగంగా చూడాలి. ఇది మాత్రమే కాకుండా ఇతర ఆహార నియంత్రణ, వ్యాయామాలు మొదలైనవి కూడా ఫాలో అయితే అప్పుడు బరువు తగ్గడం సులువు అవుతుంది.
ఎప్పుడు తాగాలి..
ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తాగితే శరీరం బాగా డిటాక్స్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. సొరకాయ జ్యూస్ తయారుచేసేటప్పుడు దాన్ని కేవలం మిక్సీ వేసి తాగాలి. అంతే కానీ దాన్ని వడకట్ట కూడదు. వడగడితే అందులో ఉండే ఫైబర్ కోల్పోతారు. ఫైబర్ కోల్పోతే బరువు తగ్గడానికి, కొవ్వును తగ్గించడానికి అంత అవకాశం ఉండదు.
మరిన్ని బెనిఫిట్స్..
సొరకాయ జ్యూస్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మరిన్ని ఇతర బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటుంది. దీన్ని దీర్ఘకాలం తాగుతూ ఉంటే జుట్టు నల్లగా, ఒత్తుగా , మెరుస్తూ ఉండేలా పెరుగుతుంది. అదేవిధంగా సొరకాయ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మానికి తేమను అందించి చర్మం మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.