Brain Health: మీ మెదడు బలహీనంగా ఉందని చెప్పే 5 లక్షణాలు ఇవీ.. వెంటనే చెక్ చేసుకోండి..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 09:56 AM

మానవ శరీరంలో మెదడు ప్రధాన అవయవం. ఇది మనిషి శారీరక ఆరోగ్యంలోనూ, మానసిక ఆరోగ్యంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Brain Health:  మీ మెదడు బలహీనంగా ఉందని చెప్పే 5 లక్షణాలు ఇవీ.. వెంటనే చెక్ చేసుకోండి..!
Brain Health

మానవ శరీరంలో మెదడు ప్రధాన అవయవం. ఇది మనిషి శారీరక ఆరోగ్యంలోనూ, మానసిక ఆరోగ్యంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉన్నవారు రోజువారీ తమ కార్యకలాపాలను చాలా చురుగ్గా చేస్తుంటారు. ఆలోచించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉంటారు. అయితే మెదడు పనితీరు సరిగా లేకపోతే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇతర శారీరక, మానసిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడు బలహీనంగా ఉంటే 5 లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..

Walking: ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!



చిరాకు..

చిరాకు అనేది మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలియజెప్పే సంకేతం. వ్యక్తుల సాధారణ ప్రవర్తనకు, మెదడు బలహీనంగా ఉన్నవారి ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. చిరాకు మానసిక ఒత్తిడిలో భాగం. ఈ చిరాకు అనే లక్షణం ఎక్కువ కాలం కొనసాగితే ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.

నిద్ర..

నిద్ర సరిగా లేకపోవడం కూడా మెదడు బలహీనంగా ఉండటాన్ని సూచిస్తుంది. నిద్ర పట్టకపోవడం, నిద్రలో పదే పదే మెలకువ రావడం, విపరీతమైన ఆలోచనలు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇవన్నీ మెదడు బలహీనంగా ఉండటాన్ని సూచిస్తాయి.

ఒంటరితనం..

మెదడు బలహీనంగా ఉన్నవారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. దేని మీదా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అవుతూ ఉంటారు. ఇదంతా మెదడు బలహీనంగా ఉండటం వల్లే జరుగుతుంది.

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!


బరువు..

వేగంగా బరువు తగ్గడం లేదా వేగంగా బరువు పెరగడం మెదడు పనితీరు సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది. మెదడు బలహీనంగా ఉండటం వల్ల ఆకలి హార్మోన్లలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల అధికంగా ఆకలి వేయడం, లేదా ఆకలి లేకపోవడం జరుగుతుంది.

మతిమరుపు..

ఏ విషయం మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు మరచిపోవడం వంటివి జరుగుతూ ఉంటే మెదడు బలహీనంగా ఉన్నట్టే. ఇది ఒత్తిడి, నిరాశ వంటి ఇతర మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఎదురుకావచ్చు.

రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 23 , 2024 | 09:56 AM

Advertising
Advertising
<