ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Breakfast: బ్రేక్ఫాస్ట్ లో ఇష్టంగా తినే ఈ 3 ఆహారాలు స్లో పాయిజన్ లా పనిచేస్తాయట..!

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:03 PM

తీసుకునే ఆహారం బాగుంటే శరీరం కూడా బాగుంటుంది. అయితే చాలామంది కాలంతో పాటూ ఆహార విధానాలు కూడా మార్చుకున్నారు.

breakfast

ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తీసుకునే ఆహారం బాగుంటే శరీరం కూడా బాగుంటుంది. అయితే చాలామంది కాలంతో పాటూ ఆహార విధానాలు కూడా మార్చుకున్నారు. ఒకప్పుడు టిఫిన్లు వంటివి ఏమీ లేకుండా భోజనమే చేసేవారు. కానీ తరువాత టిఫిన్లు వచ్చాయి. ఆ తరువాత టిఫిన్ల స్థానంలో ఇతర ఆహారాలు తీసుకోవడం మొదలు పెట్టారు. చాలామంది ఉదయాన్నే అల్పాహారంలో తినే ఆహారాలు నిజానికి స్ల పాయిజన్ లా పనిచేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..!



బ్రెడ్..

అల్పాహారం రోజు ఉత్సాహంగా ప్రారంభించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అల్పాహారం చాలా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం అనే అపోహతో చాలామంది బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. పీనట్ బటర్, జామ్, ఫ్రూట్స్, కూరగాయలతో కలిపి శాండ్విచ్ తయారు చేసుకుని తింటారు. ముఖ్యంగా చాలామంది తల్లులు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్, జామ్ ఇస్తుంటారు. అయితే బ్రెడ్ జీర్ణక్రియకు చాలా హాని చేస్తుంది. ఇది అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారం. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బ్రెడ్ ను ఎక్కువ రోజులు తింటే మధుమేహం, ఊబకాయం ఈజీగా వస్తాయి.

ప్యాక్డ్ ఫుడ్స్..

ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ప్యాక్డ్ ఫుడ్స్ లో ఉంటాయి. వీటిలో పోషకాలు ఏమీ ఉండవు. సోడియం, అనారోగ్యకర కార్బోహేడ్రేట్లు, శుద్దిచేసిన పిండి పదార్థాలు వీటిలో ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వండుకోలేక కొందరు, పిల్లలు అడిగారని మరికొందరు ప్యాక్డ్ ఫుడ్ ను బ్రేక్ఫాస్ట్ లో పెడుతుంటారు. కానీ ఇది చాలా హానికరం.

గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!


టీ..

టీ తాగడానికి భారతీయులకు వేళ పాళ అక్కర్లేదు. ఏ సమయంలో అయినా ఎన్ని సార్లు అయినా తాగేస్తుంటారు. చాలా మంది బ్రేక్ఫాస్ట్ సమయంలో టీ తాగడానికి ఇష్టపడతారు. టిఫిన్ తో పాటూ టీ తాగే అలవాటు ఉన్నవారికి చాలా నష్టం జరుగుతుంది. టీ లో ఉండే కెఫీన్ ఆహారంలో పోషకాలు గ్రహించకుండా చేస్తుంది. పాలతో చేసిన టీ తాగి దాంతో పాటూ ఉప్పు కలిగిన ఆహారాలు తిన్నా జీర్ణాశయం క్రమంగా దెబ్బతింటుంది.

టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 12 , 2024 | 02:13 PM

Advertising
Advertising
<