Cancer Foods: ఈ ఆహారాలను మీరూ ఎక్కువగా తింటూంటారా? ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని ఎంతలా పెంచుతాయంటే..!
ABN, Publish Date - May 14 , 2024 | 02:14 PM
క్యాన్సర్ కు జీవనశైలి నుండి ఆహారపు అలవాట్ల వరకు చాలా కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ కింది 7 ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.
క్యాన్సర్.. ప్రపంచంలో అధికశాతం మంది మరణాలకు కారణం అవుతున్న జబ్బులలో గుండె జబ్బుల తర్వాత స్థానంలో ఉన్నది క్యాన్సరే.. ప్రతి ఏటా క్యాన్సర్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ కు జీవనశైలి నుండి ఆహారపు అలవాట్ల వరకు చాలా కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ కింది 7 ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆహార నిపుణులు అంటున్నారు. ఆ ఆహారాలేంటో తెలుసుకుని వాటిని దూరం పెట్టడం చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాసెస్ చేసిన మాంసాలను గ్రూప్-1 కార్సినోజెన్లుగానూ, రెడ్ మీట్ ను గ్రూప్-2A క్యాన్సర్ కారకాలుగానూ వర్గీకరించింది. దీనికి కారణం మాంసాన్ని నిల్వచేయడానికి ఉపయోగించే రసాయనాలు. ఇవి క్యాన్సర్ కు దారితీస్తాయి కాబట్టి వీటిని వాడటం మానేయాలి.
పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!
రెడీ టూ ఈట్ ఫుడ్స్ ఇప్పట్లో చాలా ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇవి హార్మోన్ల అసమతుల్యత, డిఎన్ఏ ను దెబ్బతీయడం, టైప్-2 డయాబెటిస్, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిలో హానికరమైన రసాయనమైన బిస్పెనల్ ఉంటుంది.
రసాయనాలు, హెచ్ఎఫ్సిఎస్ , రంగులు, చక్కెర అధికంగా ఉండే వాటిలో కార్బోనేటెడ్ పానీయాలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్పైక్ లకు దారితీస్తాయి. వీటిలో ఉండే అనారోగ్యకరమైన సమ్మేళనాలు క్యాన్సర్ కు కారణం అవుతాయి.
చాలామంది డైట్ చేసే నెపంతో షుగర్ ఫ్రీ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే ఈ షుగర్ ఫ్రీ ఉత్పత్తులలో అస్పర్టమే ఉంటుంది. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది. దీని రసాయన ప్రతి చర్యలు దీర్ఘకాలికంగా శరీరంలో విషాలు పేరుకుపోయేలా చేస్తాయి.
తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!
హైడ్రోజనేషన్ ద్వారా ఏర్పడిన ట్రాన్స్ ఫ్యాట్ లు, బిస్కెట్లు, క్యాండీలు, కాల్చిన వస్తువులలో ఉంటాయి. ఇవి ద్రవ నూనెలను ఘన కొవ్వులుగా మారుస్తాయి. వీటిని తీసుకుంటే క్యాన్సర్ కు కారణం అవుతాయి.
మాంసాలు, పిండిపదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కాలిస్తే వాటిలో అమైన్లు, హైడ్రోకార్బన్లు వంటి కార్సినోజెనిక్ సమ్మేళనాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
మధ్యంలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇవి రకంతో సంబంధం లేకుండా కనీసం 7 రకాల క్యాన్సర్ల పెరుగుదలకు కారణం అవుతాయి.
ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!
లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 14 , 2024 | 02:14 PM