ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cauliflower: కాలీఫ్లవర్ సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదు.. ఇది తింటే కలిగే లాభాలేంటంటే..!

ABN, Publish Date - Feb 11 , 2024 | 12:44 PM

భోజనం, టిఫిన్, స్నాక్ ఇలా ఎందులోకైనా ఇట్టే ఒదిగిపోయే కాలీఫ్లవర్ సూపర్ ఫుడ్ కు ఏమీ తీసిపోదు. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..

కూరగాయలలో కాలీఫ్లవర్ కు ఓ రేంజ్ ఉంది. అందరూ గోబీ అని పిలుచుకునే ఈ కూరగాయ క్రూసిఫరస్ జాతికి చెందినది. దీన్ని కూరలుగానే కాకుండా స్నాక్స్ లానూ, పకోడీ, గోబీ65, గోబీ ఫ్రై.. ఇలా బోలెడు రకాలుగా వండుతుంటారు. భోజనం, టిఫిన్, స్నాక్ ఇలా ఎందులోకైనా ఇట్టే ఒదిగిపోయే కాలీఫ్లవర్ సూపర్ ఫుడ్ కు ఏమీ తీసిపోదు. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

పోషకాలకు పవర్ హౌస్..

కాలీఫ్లవర్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-కె కూడా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్, పోటాషియం, మాంగనీస్ రక్తపోటు నుండి గుండె ఆరోగ్యం వరకు అన్నింటిలోనూ దోహదం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Bok Choy: ఈ చైనీస్ కూరగాయ తింటే కలిగే షాకింగ్ ప్రయోజనాలేంటో తెలుసా?



నొప్పులు, వాపుల నుండి ఉపశమనం..

కాలీఫ్లవర్‌లో సల్ఫోరాఫేన్, ఇండోల్-3-కార్బినాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్‌లు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలోనూ, వాపులు, నొప్పులు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బరువు..

బరువు తగ్గాలని అనుకునేవారికి కాలీఫ్లవర్ మంచి ఎంపిక. ఇందులో క్యాలరీలు, కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఎక్కువ ఇస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

జీర్ణ ఆరోగ్యం..

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ అవసరం. కాలీఫ్లవర్ ఉండే డైటరీ ఫైబర్ గట్ బాక్టీరియా అభివృద్దికి, మలబద్ధకాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది. కాలీఫ్లవర్‌లో లభించే సల్ఫోరాఫేన్ కడుపు లైనింగ్‌ను రక్షించడంలో సహాయపడుతుంది. కడుపులో అల్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ క్రూసిఫరస్ కూరగాయలను భోజనంలో చేర్చడం వల్ల జీర్ణ ఆరోగ్యం అధ్బుతంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: చిటికెడు జాజికాయ పొడిని రోజూ తీసుకుంటే.. జరిగేదిదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 12:44 PM

Advertising
Advertising