ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Celery Juice: సెలెరీ జ్యూస్ ఎప్పుడైనా తాగారా?ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

ABN, Publish Date - May 17 , 2024 | 04:23 PM

శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటిలో సెలెరీ ఒకటి. సెలెరీ జ్యూస్ శరీరానికి చాలామంచిది. ఈ జ్యూస్‌లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. తినడం దగ్గర, తాగడం దగ్గర సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరం జబ్బుల నిలయంగా మారుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే ఆహారం విషయంలో ఆరోగ్యకరమైన పద్దతులు, మంచి అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటిలో సెలెరీ ఒకటి. సెలెరీ జ్యూస్ శరీరానికి చాలామంచిది. ఈ జ్యూస్‌లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే దీన్ని అస్సలు వదిలిపెట్టరు.

హైడ్రేటెడ్..

వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సెలెరీ జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!


రక్షణ..

వేసవిలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మండే ఎండలలో బయటకు వెళ్లినప్పుడు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది శరీరంలో కణాలను దెబ్బతీస్తుంది. సెలెరీ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. సెల్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. అందుకే సెలెరీ జ్యూస్ తాగడం మంచిది.

జీర్ణక్రియ..

ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. సెలెరీ జ్యూస్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..!


చర్మం..

వేసవిలో బయటకు వెళ్లినప్పుడు సూర్యకిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ముఖ్యంగా వడదెబ్బ, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలు ఎక్కువ. సెలెరీ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఎలక్ట్రోలైట్స్..

వేసవిలో వేడి కారణంగా సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్‌లు శరీరం నుండి పోతాయి. సెలెరీ జ్యూస్ సహజంగా ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!

రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 17 , 2024 | 04:24 PM

Advertising
Advertising