ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చలికి చెక్‌

ABN, Publish Date - Dec 01 , 2024 | 09:00 AM

చలి మొదలయ్యింది. దాన్నుంచి రక్షించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు... మామూలే. వీటికి ఇప్పుడు స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ కూడా తోడయ్యాయి. అరిచేతులు, అరికాళ్లు క్షణాల్లో వెచ్చగా మారాలన్నా, మఫ్లర్‌తో పాటు ఎంచక్కా మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేయాలన్నా సాధ్యమే. చలికి చెక్‌ పెడుతూ, వెచ్చ దనాన్ని అందించే వాటి విశేషాలే ఇవి...

చలి మొదలయ్యింది. దాన్నుంచి రక్షించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు... మామూలే. వీటికి ఇప్పుడు స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ కూడా తోడయ్యాయి. అరిచేతులు, అరికాళ్లు క్షణాల్లో వెచ్చగా మారాలన్నా, మఫ్లర్‌తో పాటు ఎంచక్కా మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేయాలన్నా సాధ్యమే. చలికి చెక్‌ పెడుతూ, వెచ్చ దనాన్ని అందించే వాటి విశేషాలే ఇవి...

మ్యూజికల్‌ మఫ్లర్‌

మఫ్లర్‌ చుట్టుకున్నప్పుడు చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ లేదా ఇయర్‌ పాడ్స్‌ పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందే. అందుకే వైర్‌లెస్‌ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్‌ హెడ్‌ఫోన్‌ క్యాప్స్‌ వచ్చేశాయి. ఫోన్‌లోని యాప్‌ ద్వారా పాటల్ని ఎంచుకోవడంతో పాటు వాల్యూమ్‌ హెచ్చుతగ్గులకు వీలుగా దీనికి ఒక బటన్‌ కూడా ఉంటుంది. క్యాప్‌లోని లిథియం అయాన్‌ బ్యాటరీ ఆరుగంటలపాటు పనిచేస్తుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా ఛార్జ్‌ చేసుకోవచ్చు. పాటలు వింటూ నడిచే అలవాటున్న వారికి బెస్ట్‌ ఛాయిస్‌.


చేతి హీటర్‌

చలికి చేతివేళ్లు కొంకర్లు తిరుగుతాయి. అరిచేతుల్ని వెచ్చగా ఉంచేందుకు ‘పోర్టబుల్‌ హ్యాండ్‌ వార్మర్స్‌’ వచ్చేశాయి. జేబులో పట్టేలా ఉండే వీటిని అరిచేతిలో పెట్టుకుంటే చాలు. దాని నుంచి వచ్చే వేడికి రక్తప్రసరణ మెరుగవుతుంది. స్విచ్‌ వేయగానే కొన్ని సెకన్లలోనే వేడెక్కే ఈ వార్మర్‌ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఐదు నుంచి పన్నెండు గంటలదాకా వెచ్చదనాన్ని అందిస్తాయి. పైగా వీటిని ఫోన్‌, ట్యాబ్‌లను ఛార్జ్‌ చేసే పవర్‌బ్యాంక్‌గానూ వాడొచ్చు. వివిధ ఆకారాలతో అందుబాటులో ఉన్నాయి.

రెక్కలుండవు...

ఆధునిక ఫ్యాన్‌కు రెక్కలుండవు. అయినా సరే కాలాన్ని బట్టి చలి, వేడి గాలులను అందిస్తుంది. చూడటానికి టేబుల్‌ ఫ్యాన్‌ మాదిరిగానే ఉంటుంది. బటన్స్‌ సాయంతో ఏసీలాగే గదిలో ఉష్ణోగ్రతలను కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు.


నులివెచ్చగా...

శీతాకాలం పాదాలను వెచ్చగా ఉంచుకునేందుకు షూస్‌ వాడతారు. రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే అధునాతన బూట్లు వచ్చేశాయి. పక్కనున్న బటన్‌ నొక్కగానే 30 సెకన్లలోపే వెచ్చని అనుభూతిని పొందొచ్చు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే, గరిష్టంగా పది గంటల వరకు వెచ్చదనాన్ని అందిస్తాయివి. వీటిలో ఉన్న పవర్‌ ఇండికేటర్ల ద్వారా ఇంకా ఎంత ఛార్జింగ్‌ మిగిలి ఉందో తెలుస్తుంది. అవసరానికి అనుగుణంగా ఉష్ణోగ్రతల్ని సెట్‌ చేసుకోవచ్చు. ఆర్థరైటీస్‌, కీళ్లనొప్పులతో బాధపడేవాళ్లకి మంచి ఛాయిస్‌. తెల్లవారుజామున లేదా రాత్రివేళ బయట తిరిగేటప్పుడూ, హైకింగ్‌, ట్రెక్కింగ్‌లకు వెళితే చలి బాధ నుంచి రక్షిస్తాయి.


మౌస్‌ప్యాడ్‌ మాయాజాలం

గంటల తరబడి సిస్టమ్‌ ముందు కూర్చొని పనిచేసేవారికి శీతాకాలంలో ‘హీటింగ్‌ మౌస్‌ ప్యాడ్‌’ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మూడు వేర్వేరు ఉష్ణోగ్రత స్థాయిలు ఉంటాయి. సిస్టమ్‌ యూఎస్‌బీ పోర్ట్‌కి దీనిని కనెక్ట్‌ చేసుకుని, అవసరానికి అనుగుణంగా ఉష్ణోగ్రతల్ని అడ్జెస్ట్‌ చేసుకుంటే సరి. దీనిలో ఉండే మూడు వేర్వేరు టైమర్ల ద్వారా కావాల్సిన విధంగా ముందుగానే టైమ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. మణికట్టుపై ఏమాత్రం భారం పడకుండా ఉండేందుకు దీనిలో ప్రత్యేకమైన రిస్ట్‌ ప్యాడ్‌ కూడా ఉంటుంది.

Updated Date - Dec 01 , 2024 | 09:00 AM