Chia Seeds: ఆరోగ్యానికి మంచిది కదా అని చియా విత్తనాలు ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే..!
ABN, Publish Date - Jun 14 , 2024 | 01:04 PM
ఆరోగ్యం మీద స్పృహ ఎక్కువగా ఉన్న చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే విత్తనాలు, గింజలు, ఆహారాలు, పానీయాలు తీసుకోవడం మీద దృష్టి పెడతారు. ఆ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విత్తనాలలో చియా గింజలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చియా గింజలను ఎక్కువగా తింటే..
ఆరోగ్యం మీద స్పృహ ఎక్కువగా ఉన్న చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే విత్తనాలు, గింజలు, ఆహారాలు, పానీయాలు తీసుకోవడం మీద దృష్టి పెడతారు. ఆ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విత్తనాలలో చియా గింజలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చియా గింజలను ఎక్కువగా తింటే ఆరోగ్య లాభాలకు బదులుగా నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఇంతకీ చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు నీరు కూడా బాగా తాగాలి. నీరు సరిగా తాగకుండా చియా విత్తనాలు ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
చియా గింజలు అందరికీ సూట్ కావు. ఇవి కొందరికి అలెర్జీ కలిగిస్తాయి. దురద, దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను ఎదుర్కుంటారు. వీటిని తీసుకున్న తరువాత పై లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వాటిని తీసుకోవడం వెంటనే ఆపేయాలి.
చియా గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ లు ఉంటాయి. ఇవి రక్తం పలుచబడేలా చేస్తాయి. రక్తానికి సంబంధించిన సమస్యల కోసం మందులు వాడేవారు చియా గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!
కొందరు చియా గింజలను నీటిలో నానబెట్టకుండా వేయించి, లేదా సలాడ్ ల పైన నేరుగా చల్లి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇవి అన్నవాహిక లేదా ప్రేగులలో అడ్డంకి ఏర్పడేలా చేస్తాయి.
చియా విత్తనాలు కొంతమందికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంలో సహాయపడతాయి. కానీ మరికొందరు షుగర్ స్పైక్స్ అనుభవించవచ్చు. ముఖ్యంగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు చియా విత్తనాలను తీసుకోకపోవడం మంచిది.
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 14 , 2024 | 01:04 PM