Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
ABN, Publish Date - Jun 28 , 2024 | 11:32 AM
వర్షాకాలంలో వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి. చల్లని వాతావరణంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాయి. వేసవిలో ఎంతో ఇష్టంగా తీసుకునే మజ్జిగ, నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, జ్యూసులు వర్షాకాలంలో తీసుకోవాలంటే కాస్త సంకోచిస్తుంటారు.
వర్షాకాలంలో వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి. చల్లని వాతావరణంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాయి. వేసవిలో ఎంతో ఇష్టంగా తీసుకునే మజ్జిగ, నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, జ్యూసులు వర్షాకాలంలో తీసుకోవాలంటే కాస్త సంకోచిస్తుంటారు. ఇలా దూరం పెట్టే ఆహారాలలో పెరుగు కూడా ఒకటి. వర్షాకాలంలో పెరుగు తినడం మంచిది కాదని కొందరు, పెరుగు తింటే ఏమీ కాదని మరికొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు పెరుగు తిన్న తరువాత దుష్ప్రభావాలు ఎదుర్కొంటూ ఉంటారు. పెరుగు గురించి పూర్తీ నిజానిజాలు తెలుసుకుంటే..
ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందంటే..!
పెరుగులో కేలరీలు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, కాల్షియం, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి12, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని నియమిత పరిమాణంలో సరైన మార్గంలో తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది.
పెరుగును ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. అయితే ఆయుర్వేదం మాత్రం వర్షాకాలంలో పెరుగు తినవద్దనే చెబుతోంది. వర్షాకాలంలో శరీరంలో వాతం పెరుగుతుంది. దీని వల్ల పిత్తం పేరుకుపోతుంది. వీటి వల్ల అనేక రకాల కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పెరుగు జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. ఒకవేళ వర్షాకాలంలో పెరుగు తినాల్సి వస్తే ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలట.
Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!
ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి వర్షాకాలంలో తాజాగా ఉన్న లేదా సరిగా నిల్వ ఉంచిన పెరుగును మాత్రమే తినాలి.
ఎక్కువ మొత్తంలో పెరుగు ఎప్పుడూ తినకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
పెరుగు తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం లేదా అలెర్జీ కనిపిస్తే వెంటనే పెరుగు వాడటం మానేయాలి. అలాగే వైద్యుడిని సంప్రదించాలి.
Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 7 టిప్స్ తో చెక్ పెట్టండి..!
Protein Powder: పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే.. ఇంట్లోనే ఇలా ప్రోటీన్ పౌడర్ తయారుచేయండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 28 , 2024 | 11:32 AM