ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:08 PM

కరివేపాకును కేవలం వంటల్లోనే కాదు.. జుట్టు సంరక్షణలోనూ, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడతారు. కొందరు కరివేపాకుతో ప్రత్యేకంగా కారం పొడి, చట్నీ, పులిహోర లాంటివి కూడా చేసుకుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులను నమిలి తింటే..

వంటలకు పోపు వేసినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో కరివేపాకు కూడా ఉంటుంది. కరివేపాకు వేయకుంటే వంటకు రుచి, సువాసన తగ్గిపోతాయి. అయితే కరివేపాకును కేవలం వంటల్లోనే కాదు.. జుట్టు సంరక్షణలోనూ, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడతారు. కొందరు కరివేపాకుతో ప్రత్యేకంగా కారం పొడి, చట్నీ, పులిహోర లాంటివి కూడా చేసుకుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులను నమిలి తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. అసలు కరివేపాకులో ఉండే పోషకాలు ఏంటి? దీంతో కలిగే లాభాలేంటి? తెలుసుకుంటే..

పోషకాలు..

కరివేపాకులో యంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి, సి వంటి విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని తినకండి..!



ప్రయోజనాలు..

కరివేపాకులో ఉండే విటమిన్-సి ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అజీర్ణం, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే ఫైబర్ ఇందుకు దోహదపడుతుంది. బలహీనమైన జీవక్రియ ఉన్నవారు దీన్ని తీసుకుంటే చాలా మంచిది.

కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!



రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ కరివేపాకులు నమిలి తింటూ ఉంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటి కారణంగా బరువు తగ్గడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించడంలోనూ, జుట్టు ఆరోగ్యంగా పెరగేలా చేయడంలోనూ కరివేపాకుది అందెవేసిన చేయి. కరివేపాకులో ఉండే పోషకాలు ఇందుకు సహాయపడతాయి. ఉదయాన్నే ఒక రెమ్మ తాజా కరివేపాకులు నమిలి తిని ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీరు తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాదు.. శరీరం కూడా శుద్ది అవుతుంది. శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Life Lesson: మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సలహా ఇది..!

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లికే చేయండి.

Updated Date - Jun 30 , 2024 | 04:08 PM

Advertising
Advertising