Diabetes Vs Sleeping: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే డయాబెటిస్ ముప్పు ఎక్కువ ఉంటుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 11:44 AM
నిద్రను గొప్ప ఔషదంగా పేర్కొంటారు వైద్యులు. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని అంటుంటారు. అయితే పేలవమైన జీవనశైలి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో నిజం బయటపడింది.
నిద్రను గొప్ప ఔషదంగా పేర్కొంటారు వైద్యులు. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని అంటుంటారు. అయితే పేలవమైన జీవనశైలి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. యువతే కాదు చిన్నారులు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. తినడంలోనూ, తాగడంలోనూ అజాగ్రత్త, కొన్ని అనారోగ్య అలవాట్లు మధుమేహానికి దారితీస్తున్నాయి. తాజాగా నిద్రకు, మధుమేహానికి మధ్య లోతైన సంబంధం ఉందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోకపోతే, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం వేగంగా పెరుగుతుందని ఈ పరిశోధన తెలిపింది.
రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో సాధారణంగా రోజుకు 8 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. రోజుకు 5 గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 16శాతం ఎక్కువగా ఉంటుంది. అదే కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రపోయేవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 41శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా తక్కువ సేపు నిద్రపోతూ ఎంత మంచి ఆహారం తీసుకున్నా టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు.
30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 77మిలిటన్ల మంది టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. సుమారు 25మిలియన్ల మంది ప్రజలు ప్రీడయాబెటిక్ తోనూ, 50శాతం కంటే ఎక్కువ మందికి మధుమేహం అస్సలు ఉంది అనే విషయం కూడా తెలియదట. ప్రస్తుతం యువత రాత్రిళ్లు మేలుకుంటూ నిద్రవేళలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో వారిలో మధుమేహం ముప్పు చాలా వేగంగా పెరుగుతోందని, ఈ విషయంలో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి: 10వ తరగతి ఫలితాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 30 , 2024 | 11:44 AM