ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: టీ, బిస్కెట్.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..

ABN, Publish Date - Nov 07 , 2024 | 08:15 PM

టీ, బిస్కెట్లు చాలామంది స్నాక్స్ సమయంలో తీసుకుంటారు. అయితే ఈ కాంబినేషన్ గురించి తాజాగా ఆహార నిపుణులు వెల్లడించిన నిజాలు ఇవే..

టీ, బిస్కెట్.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..

టీ.. భారతీయులకు పెద్ద ఎమోషన్.. టీ తాగడం అలవాటున్న వారికి టీ తో పాటు బిస్కెట్లు తినడం కూడా అలవాటు ఉంటుంది. కేవలం బిస్కెట్ లు మాత్రమే కాకుండా సమోసా, మిర్చి బజ్జీలు, రస్క్ లు కూడా తింటూ ఉంటారు. ఇవి నోటికి ఒక వైపు తీపిని మరొక వైపు ఉప్పు, కారాన్ని, ఇంకొకవైపు నోటికి వేడిని తగిలిస్తూ భలే అనుభూతిని ఇస్తాయి. అయితే టీ తో పాటు బిస్కెట్లు తినడం గురించి చాలా రోజుల నుండే చర్చలు నడుస్తున్నాయ్.. తాజాగా మళ్లీ టీ, బిస్కెట్ల కాంబినేషన్ గురించి చర్చ నడుస్తోంది. దీని గురింటి ఆహార నిపుణులు చాలా మందికి తెలియని షాకింగ్ నిజాలు వెలిబుచ్చారు. అవేంటో తెలుసుకుంటే..


ఛాయ్.. బిస్కెట్.. భలే కాంబినేషన్.. హడావిడి జీవితాల్లో ఉన్నవారు, తినడానికి సరిపడినంత డబ్బు లేనివారు ఒకప్పుడు కప్పు కాఫీలో ఒక బన్ ముంచుకుని తిని ఆ పూటకు సరిపోయిందని అనిపించేవారు. రానురాను ఇదే ఛాయ్.. బిస్కెట్ వరకు వచ్చింది. కొందరు దీన్ని స్నాక్స్ లోకి తెచ్చారు. విదేశీయులకు బిస్కెట్లు, బ్రెడ్ ప్రధాన ఆహారం కావడంతో టీ తోనూ, కాఫీతోనూ వాటిని తినేవారు. అయితే భారతీయులు ఈ టీ.. బిస్కెట్లను చాలా తొందరగా తమ అలవాటులో చేర్చుకున్నారు. ప్రస్తుతం చాలా ఇళ్లలో టీ, బిస్కెట్ లేని సాయంత్రం ఉండదు.

బిస్కెట్ల తయారీలో చాలా మంది ప్రధానంగా మైదా పిండిని వాడతారు. మైదాను ప్రతి రోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మైదా పిండి మాత్రమే కాకుండా బిస్కెట్ల తయారీకి ఏ పిండి వాడినా అది ప్రేగులకు హాని చేస్తుంది. బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరుగుదల, గుండె జబ్బులు, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది.


పామాయిల్..

బిస్కెట్లను తయారు చేసే చాలా కంపెనీలు అందులో పామాయిల్ ను ప్రధానంగా వాడతాయి. పామాయిల్ లో 100శాతం కొవ్వు ఉంటుంది. ఈ పామాయిల్ తో తయారైన బిస్కెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయి.

ఉప్పు..

చాలామంది బిస్కెట్లలో వేసే చక్కెర గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ ఎక్కువ మందికి తెలియని విషయం బిస్కెట్ల తయారీలో ఉపయోగించే ఉప్పు గురించి. సాధారణంగా వంటల్లో ఉపయోగించే ఉప్పు కంటే బిస్కెట్ల తయారీలో ఉపయోగించే ఉప్పు శాతం ఎక్కువ. రోజూ బిస్కెట్లను తీసుకుంటే రక్తపోటు పెరగడం, స్ట్రోక్ వంటి ప్రమాదాలు, గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయి.


ప్రిజర్వేటివ్స్..

బిస్కెట్లను తయారు చేసిన తరువాత వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం సహజం. ఇందుకోసం బిస్కెట్ల తయారీలో ముందుగానే కొన్ని రసాయనాలు కలుపుతారు. ముఖ్యంగా బిస్కెట్లలో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీనిసోల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోలున్ వంటివి ఉంటాయి. ఈ రెండూ హాని కలిగించేవే. ఇది మాత్రమే కాకుండా బిస్కెట్లల సోడియం బెంజోయేట్ కూడా ఉంటుంది. ఇది డిఎన్ఏ కణాలను దెబ్బతీస్తుంది.

వ్యసనంగా మారవచ్చు..

టీ తో బిస్కెట్ తినడాన్ని అలవాటు చేసుకుంటే అదొక వ్యసనంగా మారుతుంది. ముందుగానే టీలో ఉండే కెఫీన్ కూడా అదే లక్షణాలను కలిగి ఉంటుంది. టీకి అలవాటు పడ్డవాళ్లు టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటారు. టీ, బిస్కెట్లు తినడం కొకైన్, మార్పిన్ వంటి మాదకద్రవ్యాల లాంటి అనుభూతి ఇస్తాయట. వీటికి అడిక్ట్ అవ్వడం మంచిదని కాదని, ఈ కాంబినేషన్ కు దూరం ఉండాలని అంటున్నారు.

Updated Date - Nov 07 , 2024 | 08:15 PM