Uric Acid: యూరిక్ యాసిడ్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?
ABN, Publish Date - Nov 05 , 2024 | 01:12 PM
ఈ మధ్య కాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా వస్తుంది. యూరిక్ యాసిడ్‌ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఏం జరుగుతుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Uric Acid: ఈ మధ్య కాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా వస్తుంది. యూరిక్ యాసిడ్‌ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఏం జరుగుతుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మాంసం, సీఫుడ్, క్యాబేజీ, బచ్చలికూర మొదలైన ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. శరీరంలో యూరిక్ యూసిడ్ స్థాయి ఎక్కువ కాలం పాటు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ప్రధాన కారణాలు:
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. జన్యు కారణాల వల్ల కానీ, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధికంగా మద్యం సేవించడం, బయటి ఆహారం తినడం, డయాబెటిస్, కీమోథెరపీ.. ఇలా పలు రకాల కారణాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
యూరిక్ యాసిడ్ లక్షణాలు:
శరీరంలో తీవ్రమైన కీళ్ల నొప్పి, హైబీపీ, వాపు, కిడ్నీ సంబంధిత సమస్యలు, నడుము, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, నడవడానికి ఇబ్బంది, వేళ్లు వాపు వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే సరైన సమయానికి చికిత్స తీసుకోకపోతే, అది గుండె, మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇలా నియంత్రించండి:
యూరిక్ యూసిడ్ సమస్యను నియంత్రించడానికి ఎక్కువగా నీరు తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి. ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Also Read:
పచ్చి మిరపకాయలను ఇష్టంగా లాగించేస్తున్నారా.. బీ కేర్ ఫుల్..!
వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..
ఈ కలర్ ద్రాక్ష తింటే మీ గుండె సేఫ్.. అంతేకాకుండా...
For More Health and National News
Updated Date - Nov 05 , 2024 | 01:13 PM