Winter Health: వింటర్ లో వెచ్చగా ఉండాలా.. ఈ హెల్తీ టిప్స్ మీ కోసమే..
ABN, Publish Date - Jan 12 , 2024 | 10:03 AM
చలి చంపేస్తోంది. బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడటం లేదు. ఇక సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వణికించేస్తున్నాయి.
చలి చంపేస్తోంది. బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడటం లేదు. ఇక సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వణికించేస్తున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ అధికారుల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం కామన్. ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చల్లటి పొడి గాలి రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో రకరకాల శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడతాయి. పండ్లు, కూరగాయలతో తయారైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. విటమిన్ సి, జింక్, సెలీనియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
ఆహారం నుంచి పోషకాలను పొందడం అనువైనదే. ఎండ తక్కువగా ఉన్న శీతాకాలంలో విటమిన్ డి వంటి సప్లిమెంట్లను వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త సప్లిమెంట్లను ప్రారంభించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది. కణాలకు పోషకాలను రవాణా చేయడానికి నీరు కీలకం. దీనివల్ల కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి.
బయటకు వచ్చే సమయంలో సాధ్యమైనంత వెచ్చగా ఉండేందుకు స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, గ్లౌసులు ధరించండి. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను సముచితంగా పని చేయడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల రాత్రి నిద్ర తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, వెచ్చని నీటితో కడగాలి. అవసరమైతే హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి. ఇన్ఫ్లుఎంజా, ఇతర ఫ్లూ-వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఫ్లూ టీకాలు వేయించుకోవాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొ్న్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 12 , 2024 | 10:08 AM