Health News: బరువు పెరిగిపోతున్నారని బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా.. అయితే చాలా ప్రమాదంలో ఉన్నట్లే..
ABN, Publish Date - Feb 26 , 2024 | 05:11 PM
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తప్పనిసరిగా తినాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తప్పనిసరిగా తినాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు తింటే శరీరం మన నియంత్రణలో ఉండదు. అందులో భాగంగా ముందుగా ముంచుకొచ్చే పెను విపత్తే బరువు పెరగడం. అన్ని రకాల వ్యాధులు శరీరాన్ని చుట్టుముట్టడానికి అధిక బరువు రాచమార్గంగా సహకరిస్తుంది. అందుకే ఎలాగైనా బరువు తగ్గించుకోవాలనుకుంటారు చాలా మంది. ఇందు కోసం వింత వింత పనులన్నీ చేస్తారు. ఖాళీ కడుపుతో పస్తులు కూడా ఉంటారు. డైట్ పేరుతో చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో భాగమే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరంలో మెటబాలిజంను ప్రారంభించడంలో బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. హెల్తీ ఫుడ్ మన ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక స్థితి మెరుగుపరుస్తుంది. అందుకే ఉదయం తినకపోతే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రేక్ ఫాస్ట్ తినేవారితో పోలిస్తే తినని వారి మానసిక ఆరోగ్యం అస్థిరంగా ఉంటుంది. జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చికాకు, విసుగు, అలసట కలిగిస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ లో రకరకాల పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినాలి. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు, ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు శక్తి అందిస్తాయి. అంతేకాదండోయ్.. బ్రేక్ ఫాస్ట్ తినడం ద్వారా శరీరం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటుంది. సో.. లేనిపోని అపోహలు పెట్టుకోకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగించేసేయండి..
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 05:48 PM