ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: వైరల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా..ఇవి తినండి..

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:02 AM

శరీరంలో విటమిన్ సి చాలా ముఖ్యం. విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాకుండా అనేక వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇవి తింటే ఆ ప్రమాదం నుండి బయటపడుతారు.

capsicum

Vitamin C:

వైరల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? శరీరంలో విటమిన్ సి ఉంటే వైరల్ వ్యాధుల నుండి సేఫ్ గా బయటపడుతారు. విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాకుండా అనేక వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అసలు వేటిలో విటమిన్ సి ఉంటుంది? రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఏవి తింటే సహాయపడుతాయో తెలుసుకుందాం..


1. క్యాప్సికమ్:

ఈ కూరగాయ అంటే చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఒక మీడియం సైజ్ రెడ్ క్యాప్సికమ్ తింటే మీకు 152 గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. దాని సహయంతో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

2. ఆరెంజ్:

ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని అంటువ్యాధుల నుండి కాపాడుతుంది. రోగనిరోధక పనితీరుకు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడుతాయి. ఆరెంజ్‌లో డైటరీ ఫైబర్‌ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

3. జామ:

జామ చాలా రుచికరమైన పండు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. మీరు ఒక మీడియం సైజ్ జామపండు తింటే దాదాపు 125 గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఈ పండు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మీ రక్తంలో చక్కెర స్థాయి కూడా మెయింటెయిన్ చేయబడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియలో ఎటువంటి సమస్య ఉండదు.

4. కివి:

కివి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా పోషకమైన పండు. ఈ పండు తినడం ద్వారా శరీరంలో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 2 కివీలు తింటే దాదాపు 137 mg విటమిన్ సి లభిస్తుంది.

5. బొప్పాయి:

బొప్పాయి పండులో బలమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఈ పండులో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు తరిగిన బొప్పాయిలో 88 mg విటమిన్ సి ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.

6. పైనాపిల్:

పైనాపిల్‌ను ఎక్కువగా జూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ లో విటమిన్ బి6, పొటాషియం, కాపర్, థయామిన్ పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు తరిగిన పైనాపిల్ లో 79 mg విటమిన్ సి లభిస్తుంది.

7. నారింజ:

నారింజ పండులో విటమిన్ సి ఉంటుంది. మీడియం సైజ్ నారింజను తింటే 70 mg విటమిన్ సి పొందుతారు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Updated Date - Nov 11 , 2024 | 11:07 AM