ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fruits: పండ్లు ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 02:22 PM

శరీరానికి ఆరోగ్యం చేకూర్చేవాటిలో పండ్లు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఆహారంలో పండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పండ్లతో పూర్తీ లాభాలు కావాలంటే..

Eating Fruits

శరీరానికి ఆరోగ్యం చేకూర్చేవాటిలో పండ్లు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఆహారంలో పండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఎన్ని పండ్లు తింటున్నా ఆరోగ్యం మెరుగవ్వడం లేదని చెప్పేవారు కూడా ఉంటారు. అలాంటి వారు పండ్లు తినే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. పండ్లు ఏ సమయంలో తినాలి? ఎప్పుడు తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలు ఉంటాయి? తెలుసుకుంటే..

ఏ సమయంలో తినకూడదు..

భోజనం సమయంలోనూ, భారీ ఆహారాలతోనూ పండ్లు తినకూడదు. దీని వల్ల పండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీని కారణంగా కడుపులో ఆహారం పులిసిపోయి ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. జీర్ణ రసాల విడుదలకు, పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే భోజనంతో ఎప్పుడూ పండ్లు తినకూడదు.

Relationship: పెళ్లి తరువాత గొడవలు ఉండకూడదంటే.. పెళ్లికి ముందే భాగస్వామిని 7 ప్రశ్నలు అడగాలి..!



పండ్లు ఏ సమయంలో ఎలా తింటే లాభం..

  • పండ్లు తినడానికి సరైన మార్గాన్ని ఆయుర్వేదం వెల్లడించింది. భోజనానికి 1 గంట ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తరువాత పండ్లు తినవచ్చు.

  • భోజనంతో పాటూ లేదా భోజనం తిన్న వెంటనే పండ్లు తినే అలవాటు మంచిది కాదు.

  • పండ్లను నేరుగా తినడమే మంచిది. పండ్లను ఎప్పుడూ పాలు, పెరుగుతో కలిపి తినకూడదు.

  • చాలామంది పండ్లు తినడానికి బద్దకించి పండ్ల రసాలు తాగుతుంటారు. కానీ పండ్లను నేరుగా తినడమే మంచిది. పండ్లు నమిలే పరిస్థితి లేకపోతే లేదా జీర్ణసంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పండ్ల రసాలను తీసుకోవాలి.

ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!


  • పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే రాత్రి పడుకునేముందు కూడా తినకూడదు. పండ్లను అల్పాహారంలో తీసుకోవచ్చు. అదే విదంగా భోజనానికి గంట ముందు తినవచ్చు.

  • పాలతో పండ్లు తినాలని అనుకునేవారు బాగా పండిన పండ్లను మాత్రమే ఉపయోగించాలి. బాగా పండిన మామిడి, అవకాడో, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ప్రూట్స్ ను పాలతో తీసుకోవచ్చు.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 18 , 2024 | 02:22 PM

Advertising
Advertising
<