ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Golden Hour: గుండె పోటు తర్వాత గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఎందుకు? ఇది ఎందుకు అంత ముఖ్యం?

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:46 AM

గుండెపోటు వచ్చిన తరువాత ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే..

Heart Attack

గుండె పోటు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది మరణాలకు కారణం అవుతున్న అతి పెద్ద సమస్య. ఈ కాలంలో మరీ దారుణంగా 30 ఏళ్ల లోపు యువతకు కూడా గుండె జబ్బులు రావడం, కొందరు ఆన్ ది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. ఈ కారణంగా గుండె జబ్బుల మీద, గుండె పోటు వస్తే వెంటనే చేయాల్సిన పనుల మీద, గుండె పోటు వచ్చిన తరువాత ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అని ఎందుకు అంటారు అనే విషయం మీద అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.

అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?


గుండె జబ్బులు..

రోజు రోజుకు గుండె జబ్బుల కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలలో గుండె జబ్బుల పట్ల, ఎవరైనా గుండె జబ్బుకు లోనైతే వారి ప్రాణాలు నిలబెట్టడం కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యల మీద అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో సిపిఆర్ మీద చాలా అవగాహన పెంచుతున్నారు. అయితే ఈ కోవలోకి గోల్డెన్ అవర్ కూడా చేర్చాల్సిందే. గుండె పోటు వచ్చిన తరువాత ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు.

గోల్డెన్ అవర్..

గుండె పోటులో గోల్డెన్ అవర్ ను గోల్డెన్ టైమ్ అని చెబుతారు. గుండె పోటు వచ్చిన ఒక గంట లోపు గుండెపోటు బారిన వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందడం చాలా ముఖ్యం. గుండెపోటు-కార్డియాక్ అరెస్ట్ లక్షణాలను సకాలంలో గుర్తిండం, సిపిఆర్ ఇవ్వడం వల్ల 60 నుండి 70 శాతం ప్రాణాలు నిలబడే అవకాశాలు ఉంటాయి.

గుండె పోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో అప్పటికే గుండె జబ్బుల బారిన పడిన వారు, గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. అలాంటి వారు గుండె పోటు లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బు ఎలా సంపాదించవచ్చు తెలుసా?


గుండె పోటు లక్షణాలు..

కొన్ని లక్షణాలను బట్టి గుండెపోటును గుర్తించవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి తీవ్రంగా ఉండటం, ఛాతీ మొత్తం భారంగా అనిపించడం, అలసట ఎక్కువగా ఉండటం. చెమటలు విపరీతంగా పట్టడం, మైకము కమ్మినట్టు ఉండటం వంటి సమస్యలు గుండెపోటు రావడాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే గుండెపోటు వస్తుంది.

గోల్డెన్ అవర్ లో..

గుండెపోటుకు గురైన వ్యక్తికి గోల్డెన్ అవర్ లో తీసుకునే చర్యలు తిరిగి ప్రాణం పోస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గోల్డెన్ అవర్ లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ ను కార్డియోపల్మోనరీ రెససిటేషన్ అంటారు. సరైన వేగంతో ఛాతీని నొక్కడం ద్వారా రక్తప్రసరణను తిరిగి యాక్టీవేట్ చేసి గుండె కొట్టుకునేలా చేస్తారు. అంతేకాదు.. గుండె పోటు వస్తే వెంటనే అస్పిరిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!

ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 30 , 2024 | 11:46 AM