ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Green Tea: ఈ సమయంలో గ్రీన్ టీ తాగండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు..!

ABN, Publish Date - Sep 02 , 2024 | 02:19 PM

గ్రీన్ టీ తాగే సమయం కూడా దాని వల్ల కలిగే లాభాలను తారుమారు చేస్తుంది. ఏ సమయంలో గ్రీన్ టీ తాగితే మంచిది?

Green Tea

గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ పెరిగిన చాలామంది గ్రీన్ టీని తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. పాల టీకి, కాఫీ కి బదులుగా గ్రీన్ టీ తాగేవారు ఉన్నారు. ఎప్పుడూ పనులలో బిజీగా ఉండేవారికి గ్రీన్ టీ చాలా మేలు చేస్తుందని అంటున్నారు. అయితే గ్రీన్ టీ తాగే సమయం కూడా దాని వల్ల కలిగే లాభాలను తారుమారు చేస్తుంది. ఏ సమయంలో గ్రీన్ టీ తాగితే మంచిది? గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

కేవలం ఈ 9 అలవాట్లతో మీరు జెమ్ అయిపోతారు..!


గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • గ్రీన్ టీ తాగితే పొట్ట మీద పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

  • ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకునేవారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

  • మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

  • రోగనిరోధక శక్తి బలంగా ఉంచడంలో కూడా గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

  • గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!


ఉదయాన్నే తాగితే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పాలీఫెనాల్స్ టానిన్లు కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. ఇది కడుపు నొప్పి, మంట, మలబద్దకం వంటి సమస్యలు కలిగిస్తుంది. ఉదయం టిఫిన్ చేసిన తరువాత గ్రీన్ టీ తాగాలి. భోజనం తరువాత కానీ, స్నాక్స్ తీసుకోవడానికి భోజనానికి మధ్య సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. గ్రీన్ టీని వేడినీటిలో వేసిన తరువాత ఎక్కువసేపు అలాగే ఉంచకూడదు. దీనివల్ల అందులో కెఫీన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేసి వాంతులు, గ్యాస్, మైకము వంటి సమస్యలను పెంచుతుంది.

రాత్రిపూట తాగితే..

రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగకూడదు. దీనివల్ల కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగితే నిద్ర సమస్యలు కూడా వస్తాయి. అందుకే గ్రీన్ టీని పగటి సమయంలోనే తాగాలి.

విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!


సరైన సమయం..

గ్రీన్ టీని టిఫిన్ చేయడానికి కొంచెం ముందుగా తాగవచ్చు. ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజుకు మూడు కప్పులకు మించి గ్రీన్ టీ తాగకూడదు. గ్రీన్ టీలో పాలు, పంచదార వేయకూడదు. గ్రీన్ టీ తాగిన తరువాత కొంతసేపటి వరకు ఏమీ తినకూడదు.

ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!


Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిద్రకు ఇబ్బంది ఉండదు..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 02 , 2024 | 02:19 PM

Advertising
Advertising