ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Grilling Meat: కాల్చిన మాంసం తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

ABN, Publish Date - Aug 01 , 2024 | 03:02 PM

మాంసాహారం చాలామందికి ప్రియమైన ఆహారం అయిపోయింది. వీకెండ్ వచ్చినా, స్నేహితులతో పార్టీ చేసుకున్నా, కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లినా ఖచ్చితంగా ఆహారం విషయంలో కూడా స్పెషల్ ఉండాల్సిందే అనుకుంటారు.

Grilling Meat

మాంసాహారం చాలామందికి ప్రియమైన ఆహారం అయిపోయింది. వీకెండ్ వచ్చినా, స్నేహితులతో పార్టీ చేసుకున్నా, కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లినా ఖచ్చితంగా ఆహారం విషయంలో కూడా స్పెషల్ ఉండాల్సిందే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో గ్రిల్లింగ్ మాంసం లేదా కాల్చిన మాంసం చాలా ఆదరణ పొందింది. చాలా మంది ఈ రకమైన మాంసం తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ రకమైన మాంసం తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందనే వార్తలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దీని గురించి తెలుసుకుంటే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!


అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని నేరుగా కాల్చినప్పుడు మంసంలో ఉండే అమైనో ఆమ్లాలు, చక్కెరలు, క్రియేటిన్ కలిసి అదిక ఉష్ణోగ్రత వద్ద హానికరమైన రసాయనాలు ఏర్పరుస్తాయి. హెటెరోసైక్లిక్ అమైన్లు, పాలీసైక్లిక్ హైడ్రోకార్భన్ లను క్యాన్సర్ కారకాలుగా పిలుస్తారు. ఇవి గ్రిల్లింగ్ ప్రక్రియలో భాగంగా మాంసం మీద ఏర్పడతాయి. ఇవి శరీరంలో DNA కణాలలో మార్పులకు దారితీస్తాయి. వాటిని క్యాన్సర్ లుకా మారుస్తాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే గ్రిల్లింగ్ ప్రక్రియ ద్వారా మాంసాహారంలో కొవ్వులు అసంపూర్ణ కొవ్వులుగా మారతాయి.

రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!


గ్రిల్లింగ్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ రాకూడదంటే ఇలా చేయండి.

  • మాంసాన్ని గ్రిల్లింగ్ చేసే 20 నిమిషాల ముందు మాంసాన్ని మేరినేట్ చెయ్యాలి. ఇది 90సాతం హెటెరోసైక్లిక్ అమైన్ లను తగ్గిస్తుంది.

  • మాంసాన్ని గ్రిల్ చేసేందుకు ఎక్కువ ఉష్ణోగ్రత వినియోగించకూడదు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు కాల్చాలి.

  • మాంసాన్ని గ్రిల్ చేయడానికి ఫైర్ చిమ్నీని కొనుగోలు చేయాలి.

  • కొవ్వు ఎక్కువ ఉండే మాంసాలు ఎక్కువ పొగను విడుదల చేస్తాయి. దీనికి బదులు లీన్ కట్ లను ఎంచుకోవాలి.

  • మాంసాన్ని నేరుగా మంటల మీద ఉంచకూడదు.

మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఇన్ని రోగాలు వస్తాయా..!

వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 01 , 2024 | 03:02 PM

Advertising
Advertising
<