ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guava: చలికాలంలో జామపండ్లు తినాలని చెప్పేది ఇందుకే.. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:18 PM

జామపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే.. చలికాలంలో వీటని తినాలని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Guava

జామపండ్లను పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. యాపిల్ లో ఉండే పోషకాలలో చాలాశాతం జామ పండ్లలోనూ ఉంటాయి. ఓ ఇరవై ఏళ్ల కిందట యాపిల్, కివి, లిచీ, అవకాడో, పియర్ వంటి విదేశీ పండ్ల జాడ భారత్ లో ఉండేది కాదు.. అప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తిన్న పండ్లు జామ పండ్లే.. అయితే ఈ జామ పండ్లను చలికాలంలో తప్పకుండా తినాలని అంటున్నారు. ఆయుర్వేదం నుండి శాస్త్రీయ వైద్యం వరకు జామ పండును రికమెండ్ చేస్తుంది. ఇంతకీ చలికాలంలో జామపండ్లు ఎందుకు తినాలంటే..

పోషకాలు..

జామ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పోషకమైన పండు. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

Ayurveda Vs Korean: ఆయుర్వేద చర్మ సంరక్షణ, కొరియన్ చర్మ సంరక్షణ.. రెండింటిలో ఏది ఎఫెక్ట్ అంటే..


ప్రయజనాలు..

  • బరువు నియంత్రించడంలో జామ పండు చక్కగా సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో పైబర్ ఉంటుంది. ఈ కారణంగా జామ పండు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. అధికంగా ఆహారం తీసుకోకుండా ఉండటంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోకి వెళ్లే కేలరీల శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

  • విటమిన్-సి జామ పండులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ ఒక జామ పండు తింటుంటే విటమిస్-సి లోపం దరిచేరదు.

  • జామ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణమై గ్యాస్ సమస్య రాకుండా చేస్తుంది. జీర్ణశక్తిని బలంగా మారుస్తుంది.

  • జామ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇవి మధుమేహం ఉన్నవారికి కూడా సేఫ్ గా పరిగణించబడతాయి. మధుమేహం లేని వారు కూడా జామ పండ్లను తింటూ ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

  • గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కూడా జామపండు సహాయపడుతుంది. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. గుండె సంబంధ వ్యాధులను, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..


  • చర్మ సంరక్షణకు కూడా జామపండ్లు భేషుగ్గా పని చేస్తాయి. జామ పండ్లు రెగ్యులర్ గా తీసుకుంటే చర్మం మెరుస్తుంది. చర్మం యవ్వనంగా మారుతుంది. జామలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మం ఎలాస్టిక్ గుణాన్ని పెంచుతుంది. మచ్చలు, ముడతలు, గీతలను తొలగిస్తుంది.

  • జామ పండ్లు తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది కంటి సంబంధ సమస్యల నుండి బయట పడటంల సహాయపడుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది.

  • జామపండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజూ ఒక జామ పండు తింటూ ఉంటే మానసిక ఒత్తిడి నియంత్రించుకోవచ్చు.

  • జామ పండ్లలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, నొప్పిని తగ్గిస్తాయి. శరీరంలో కండరాలను రిలాక్స్ గా ఉంచుతాయి.

ఇవి కూడా చదంవడి..

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..

ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 12 , 2024 | 04:18 PM