ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Human Eyes: ఈ తప్పులు చేస్తే కళ్ల ఆరోగ్యం దెబ్బతినడం పక్కా

ABN, Publish Date - Aug 24 , 2024 | 02:45 PM

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని అర్థం. అయితే నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కళ్లపైన భారీగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఇంటర్నెట్ డెస్క్: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని అర్థం. అయితే నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కళ్లపైన భారీగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం కొంపముంచే అవకాశం ఉంది. మనిషి సాంకేతికతకు దగ్గరవుతున్న క్రమంలో కంటి ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశాడు. గంటలతరబడి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడంతో కంటి చూపు మందగించడం, కళ్లల్లో మంట, దురద పుట్టడం, నిరంతరాయంగా కన్నీరు రావడం వంటి సమస్యలు వేధిస్తాయి. కళ్లకు ముప్పు తెచ్చే పలు తప్పులను ఇప్పుడు చూద్దాం..

స్క్రీన్‌ని అతిగా చూడటం..

కంప్యూటర్, ల్యాప్‌టాప్, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్స్‌ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను గంటలతరబడి చూడటం కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. నైట్ డ్యూటీలు చేసే వారి కళ్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. తద్వారా కళ్లు పొడిబారడం, చికాకుగా అనిపిస్తుంది. స్క్రీన్ అతిగా చూడటం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఎలక్ట్రానిక్ పరికరాల ముందు పని చేస్తున్నప్పుడు 20-20-20 నియమం పాటించాలి. సిస్టమ్‌పై ఉన్న ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లపాటు విరామం తీసుకోవాలి. కళ్లపై ఒత్తిడి తగ్గించుకోవడానికి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును తదేకంగా చూడాలి.


యూవీ కిరణాల ప్రమాదం..

సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు కళ్ళను దెబ్బతీస్తాయి. కంటిశుక్లం, మచ్చల క్షీణత ప్రమాదాన్ని పెంచుతాయి. UV కిరణాలను 100 శాతం నిరోధించే సన్ గ్లాసెస్ (UVA, UVB రెండూ)అవసరం. ఓజోన్ పొర క్షీణిస్తుండటంతో సూర్యుడి నుంచి అతినీలలోహిత (UV) కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఈ కిరణాలు మన కళ్లపై పడితే చాలా ప్రమాదం. ఇవి కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కళ్ళను కాపాడుకోవడానికి UVA, UVB సహా UV రేడియేషన్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే సన్ గ్లాసెస్ ధరించడం తప్పనిసరి.

లక్షణాలను విస్మరించడం

తలనొప్పి, కళ్లు పొడిబారటం వంటివి కంటి సమస్యలకు ప్రారంభ సంకేతాలు కావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే కళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. లక్షణాలను విస్మరిస్తే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది.

సొంత వైద్యం వద్దు..

కళ్లు దురద పెడుతుంటే రెగ్యులర్ ఐ డ్రాప్స్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. ఐ డ్రాప్స్ వాడితే కంటికి ఉపశమనం లభిస్తుంది. కానీ వైద్యుల సూచన లేకుండా ఐ డ్రాప్స్ వాడటం హానికరమని అంటున్నారు నిపుణులు. కంటి చుక్కలు స్టెరాయిడ్లను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి. అయితే డాక్టర్లను సంప్రదించకుండా ప్రిజర్వేటివ్ ఫ్రీ లూబ్రికేటింగ్ కంటి చుక్కలను (కృత్రిమ కన్నీళ్లు) ఉపయోగించవచ్చు. వీటిని వాడుతుంటే చికాకు వస్తుంటే వైద్యుడిని సంప్రదించడం మేలు.


బీపీ, షుగర్..

శరీర ఆరోగ్యం కూడా ఐ హెల్త్‌పై ప్రభావం చూపుతుంది. హైబీపీ, షుగర్ వ్యాధి కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కంటిశుక్లం, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, కంటి ఇన్ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీ, మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం.

ప్రిస్క్రిప్షన్ లేని కళ్లజోడు..

డాక్టర్లు సూచించిన మేరకే ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయానికి సాధారణ కంటి పరీక్షలు చేయించుకోవాలి. చాలా మంది ఈ పరీక్షలను నిర్లక్ష్యం చేస్తారు. కళ్లు బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటారు. అలా ఎన్నడూ చేయకూడదు. ఇక.. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ధరించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి డాక్టర్లు సూచించిన కళ్లజోడు ధరించాలి. నలభై ఏళ్ల వయస్సుపైబడిన వారు ప్రతీ రెండేళ్లకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి.

For Latest News and National News click here

Updated Date - Aug 24 , 2024 | 02:51 PM

Advertising
Advertising
<