Hair Growth: ఆహారంలో ఈ విటమిన్లను తీసుకోండి చాలు.. జుట్టు పెరుగుదల చూసి మీరే షాకవుతారు..!
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:39 PM
జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికి తగినట్టే బోలెడు రకాల షాంపూలు, నూనెలు, హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే.. జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో చాలా నిరాశకు గురవుతారు. అయితే
జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికి తగినట్టే బోలెడు రకాల షాంపూలు, నూనెలు, హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే.. జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో చాలా నిరాశకు గురవుతారు. అయితే జుట్టు పెరుగుదల ఆహారం మీద, తీసుకునే విటమిన్ల మీద ఆధారపడి ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే మూడు రకాల విటమిన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో తెలుసుకుంటే..
ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!
విటమిన్-డి..
విటమిన్-డి లోపం ఉండటం, తక్కువ స్థాయిలో శరీరంలో ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఇది మహిళలో జుట్టు రాలడానికి చాలా ఎక్కువగా కారణమవుతుంది. జుట్టు పెరుగుదల బాగుండాలంటే విటమిన్-డి తప్పనిసరిగా శరీరానికి అందేలా చూడాలి. సాల్మన్ ఫిష్, గుడ్లు, పుట్టగొడుగులు, నారింజ రసం, బలవర్థకమైన పాలు, పాల పదార్థాలలో విటమిన్-డి ఉంటుంది.
విటమిన్-బి..
విటమిన్-బి12 జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టును కండిషన్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ముదురు ఆకుపచ్చ కూరలు సహా తృణధాన్యాలు, కూరగాయలు, గొడ్డు మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, మాంసం, చిక్కుళ్లు, అవకాడో మొదలైన వాటిలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.
జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!
విటమిన్-ఇ..
విటమిన్ ఇ అనేది శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే పోషకం. వీట్ సీడ్ ఆయిల్, బాదం, అవకాడో, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగ, వేరుశెనగ నూనె, సోయాబీన్ నూనె, బచ్చలికూర మొదలైనవాటిలో విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది.
జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!
ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 20 , 2024 | 04:39 PM