Asthma: ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిది..
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:58 PM
ఆస్తమా ఉన్నవారు చలికాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రెమెడీలను పాటిస్టే ఆస్తమా నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. అయితే, ప్రతిరోజు ఎలాంటి రెమెడీలను పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Asthma Winter Tips: చలికాలంలో ఆస్తమా సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒక్కసారి వస్తే అంత సులువుగా తగ్గదు. దగ్గుతో పాటు చాతినొప్పి, ఉబ్బసం వంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి, ఈ చలికాలంలో ఆస్తమా సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉన్ని దుస్తులు మేలు
ఆస్తమాతో బాధపడుతున్న వారు చలికాలంలో వెచ్చదనాన్ని అందించే దుస్తులు ధరిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చలికాలంలో ఆస్తమాతో ఇబ్బంది పడే వారు ఉన్ని, మందమైన దుస్తులను ధరించడం మేలు. అంతేకాకుండా, కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ ఆస్తమాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తులసి ఆకులతో..
తులసి ఆకుల డికాషన్ ఆస్తమాను కంట్రోల్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక రెండు గ్లాసుల నీటిలో తగినన్ని తులసి ఆకులను వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న నీటిని వడకట్టుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు.
అతిమధురం చూర్ణం..
చలికాలంలో ఆస్తమా ఉన్న వారికి దగ్గు విపరీతంగా వస్తువుంటుంది. అంతేకాకుండా ఉబ్బసం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అలాగే కొంతమంది గొంతులో కఫం కూడా విపరీతంగా పేరుకుపోతూ ఉంటుంది. వీటన్నిటిని అతిమధురం చూర్ణం సులభంగా తొలగించేందుకు సహాయపడుతుంది. గోరువెచ్చని గ్లాస్ నీటిలో అతిమధురం చూర్ణం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేస్తే ఆస్తమా సమస్యల నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అల్లం డికాషన్..
ఆస్తమాతో బాధపడేవారు చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు అల్లం డికాషన్ తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి రోగనిరోధక శక్తి అందించడమే కాకుండా శ్వాసకోశ సమస్యల నుంచి అల్లం డికాషన్ విముక్తి కలిగించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా ఉన్నవారికి అల్లం డికాషన్ ది బెస్ట్ రెమెడీగా పనిచేస్తుందని తెలుపుతున్నారు.
(Note:పై సమాచారం ఆయుర్వేద నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)
Updated Date - Dec 03 , 2024 | 01:59 PM