Kapalabhati: కపాలభాతి ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ABN, Publish Date - Nov 07 , 2024 | 05:17 PM
కపాలభాతి ప్రాణాయామంతో అనేక మానసిక శారీరక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అంతరాత్మతో అనుసంధానమే యోగా అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఇక యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన, సమాధి అని అనే అష్టాంగాల సమాహారమే యోగా! ఇవన్నీ ఆచరించిన వారికి జ్ఞానసిద్ధి కలుగుతుందని చెబుతారు. అయితే, యోగాసనాలు, ప్రాణాయామంతో ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా కపాలభాతి ప్రాణాయామంతో అనేక మానసిక శారీరక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు (Kapalabhati).
Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!
కపాలభాతి అంటే మనసుకు స్పష్టత తీసుకొచ్చేదని అర్థం. దీనితో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా, శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం సుదీర్ఘకాలం పాటు నిలిచుంటుందట.
కపాలభూతిలో బలంగా శ్వాసతీసుకుంటారు. ఫలితంగా శరీరంలోని కార్బన్‌డైయాక్సైడ్ సమర్థంగా తొలగిపోతుంది. అంతేకాకుండా, ఇతర విషతుల్యాలు కూడా తొలగిపోతాయి. దీంతో, శ్వాసకోశ వ్యవస్థ పూర్తిస్థాయిలో పరిశుభ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాణాయామంతో ఉదరకండరాలు సంకోచవ్యాకోచాలకు లోనై జీర్ణవ్యవస్థ మరింత క్రియాశీలకమవుతుంది. దీంతో, జీవక్రియల వేగం పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఫుడ్‌లోని పోషకాలను శరీరం పూర్తిస్థాయిలో గ్రహించగలుగుతుంది.
Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..
ఈ ప్రాణాయామంతో ఉదరకండరాలపై కూడా ఒత్తిడి పడి కడుపు భాగం మరింత ద్రుఢమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కపాలభాతి ద్వారా మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీంతో, ఏకాగ్రత, స్పష్టత పెరుగుతాయి.
కపాలభాతితో పారాసింపాథిటిక్ నాడీ వ్యవస్థ క్రియాశీలకమవుతుంది. దీంతో, ఒత్తిడి తగ్గి మెదుడు, శరీరం రిలాక్స్ అవుతాయి.
కపాలభాతి చేసే విధనం
ఈ ప్రాణాయామం చేసేముందుకు ధ్యానముద్రలో నేలపై కూర్చోవాలి. ఆ తరువాత ఊపిరితిత్తుల నిండుగా గాలిని లోపలికి పీల్చుకోవాలి. ఆ తరువాత పొట్టను లోపిలకి తీసుకుంటూ ఊపిరిని బలంగా బయటకు వదలాలి. ఇలా 20 సార్లు చేస్తే కపాలభాతి ఒక రౌండ్ పూర్తి చేసినట్టు. ఆ తరువాత కొన్ని క్షణాలపాటు రిలాక్స్ అవ్వాలి. మరో మారు కపాలభాతి ప్రారంభించి వీలైనన్ని సార్లు చేయాలి.
ఈ ప్రాణాయామం చేయాలనుకున్న వారు అనుభవజ్ఞులైన యోగాగురువుల వద్ద నేర్చుకుని అనుసరిస్తే పూర్తిస్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!
Updated Date - Nov 07 , 2024 | 05:32 PM