ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: రోజూ తినే ఈ 5 ఆహారాలు నరాలకు విషం కంటే తక్కువ కాదు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..!

ABN, Publish Date - Oct 01 , 2024 | 06:13 PM

ఆరోగ్యం అనుకుని ప్రతి రోజూ తీసుకుంటున్న కొన్ని ఆహారాలు శరీరానికి చాలా చేటు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వీటిని పిల్లలకు కూడా పెట్టడం విషంతో సహానమే..

ఆహారం శరీరానికి శక్తి వనరు. ఆహారం సరిగా తీసుకుంటేనే రోజులో చెయ్యాల్సిన పనులను చురుగ్గా చేస్తుంటాం. అయితే రోజూ ఆహారంలో భాగంగా ఉపయోగించే కొన్ని పదార్థాలు శరీరంలో నరాలకు విషం లాగా పనిచేస్తాయట. శుద్ధి చేసిన నూనెలు, చక్కెర, జామ్‌లు, సాస్‌లు భారతదేశంలో చాలామంది ప్రతిరోజూ తినే ఆహారాలు. అయితే రోజూ వాడే ఈ వస్తువులు రుచిలో మెరుగ్గా ఉండొచ్చు, పిల్లలు ఆహారం సరిగా తినడం లేదనో.. పిల్లలు మారాం చేస్తారనో, రుచి బాగుంటుందనో చాలామంది సాస్ లు, జామ్ లు వాడుతుంటారు. అయితే వాటి వినియోగం ఆరోగ్యాన్ని దారుణంగా పాడు చేస్తుంది.

దానిమ్మ పండును వరుసగా వారం రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!


రిఫైండ్ నూనె..

రిఫైండ్ అయిల్ నేటికాలంలో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఈ నూనెలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. కేలరీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు చాపకింద నీరులా వస్తాయి. రిఫైండ్ ఆయిల్ కు బదులుగా ఆవాల నూనెను వంట కోసం ఉపయోగించడం మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

స్నాక్స్..

చిన్న పిల్లలు అయినా పెద్దలు అయినా సాయంత్రం అవ్వగానే స్నాక్స్ ఉంటే బాగుంటుందని పట్టుబడుతూ ఉంటారు. వేయించిన ఆహారాలు తింటే ఊబకాయం, క్యాన్సర్, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణక్రియ, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ వేయించిన ఆహారాలకు బదులుగా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, తృణధాన్యాలతో చేసిన ఆహారాలు, పాతకాలం నాటి ఆవిరి పెట్టిన ఆహారాలు తీసుకోవడం మంచిదట.

Skin Care: వామ్మో.. ఆవాల నూనె, పసుపు కలిపి ముఖానికి రాస్తే ఇంత మ్యాజిక్కా?


జ్యూసులు..

జ్యూసులు తాగడం అంటే చాలా మందికి ఇష్టం. పండ్లు తినడం కంటే జ్యూసులు తాగడానికే ఇష్టపడతారు. కొందరు మార్కెట్లో లభ్యమయ్యే ఇన్స్టంట్ జ్యూసులు తాగడానికి కూడా ఆసక్తి చూపుతారు. వీటిలో చక్కెర శాతం ఎక్కువ. కృత్రిమ రంగులు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి. తాజా పండ్ల రసంలో కూడా కేలరీలు ఎక్కువే ఉంటాయి. దీనికి బదులు తాజా పండ్లను తినాలి. ఇందులో ఫైబర్ తో సహా పోషకాలన్నీ లభిస్తాయి.

జామ్, సాస్..

బ్రెడ్, బిస్కెట్స్ తినడానికి చాలామంది జామ్ వాడుతుంటారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ ఇచ్చే తల్లులు చాలామంది ఉన్నారు. ఇక సాస్ లు లేకపోతే ఏ స్నాక్ ను తినలేని పరిస్థితిలో కొందరు ఉన్నారు. వీటిలో చక్కెర శాతం, సోడియం, కృత్రిమ రంగులు ఎక్కువ ఉంటాయి. వీటి బదులు ఇంట్లోనే తాజాగా స్వీట్ చట్నీ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, పల్లీ చట్నీ వంటివి తయారు చేసుకుని తీసుకోవచ్చు.

Obesity: పురుషులకు అలర్ట్! ఊబకాయంతో టెస్టెస్టిరాన్ హార్మోన్‌ తగ్గుదల!


చక్కెర..

ఇప్పట్లో అధికశాతం ప్రజలు తొందరగా మధుమేహం బారిన పడటానికి చక్కెర ఎక్కువ తినడమే కారణం. కేవలం మధుమేహం మాత్రమే కాకుండా ఊబకాయం, అధిక రక్తపోటు, దంత సంబంధ సమస్యలు, గుండె జబ్బులు మొదలైన సమస్యలకు చక్కెర అధిక వినియోగం కారణం అవుతుంది. చక్కెరకు బదులుగా బెల్లం వాడాలి. ఆర్గానిక్ బెల్లం వాడటం వల్ల ఐరన్ పెరిగి రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. అలసట దూరం అవుతుంది.

ఇవి కూడా చదవండి..

శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!

ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 01 , 2024 | 06:13 PM