Blood Group: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు వెరీ లక్కీ..
ABN, Publish Date - Dec 09 , 2024 | 05:12 PM
మన బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కొన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కానీ, ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు వెరీ లక్కీ అని వైద్యులు చెబుతున్నారు.
Blood Group: సాధారణంగా బ్లెడ్ గ్రూప్ లు నాలుగు రకాలు ఉంటాయి. A, B, AB,O. బ్లడ్ గ్రూప్ A కలిగిన వ్యక్తులు O & A బ్లెడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల నుండి రక్తాన్ని పొందవచ్చు. బ్లడ్ గ్రూప్ B ఉన్న వ్యక్తులు B & O వ్యక్తుల నుండి రక్తాన్ని పొందవచ్చు. O బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు O నుండి మాత్రమే రక్తాన్ని పొందగలరు. కానీ, వారు మాత్రం A, B, AB, O అందరికీ రక్త దానం చేయవచ్చు.
O+ లక్కీ బ్లడ్ గ్రూప్..
అయితే, మన బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కొన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కానీ, ఆరోగ్యం విషయానికి వస్తే O+ పాజిటివ్ అనేది లక్కీ బ్లడ్ గ్రూప్. ఇది ఏదైనా బ్లడ్ గ్రూప్‌కి అనుకూలంగా ఉంటుంది. అంతే కాదు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.
గుండె జబ్బులు..
O+ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం గడ్డకట్టే సమస్యలు ఉండవు. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాలేయం వ్యాధులు..
O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కాలేయం వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి పిత్తాశయంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి గాల్ బ్లాడర్ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
O+ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కొన్ని ప్రత్యేక రోగనిరోధక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటారు.
ఒత్తిడిని తట్టుకోగలరు..
O+ ఉన్న వ్యక్తులు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యల వల్ల తక్కువగా ప్రభావితమవుతారు. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఒత్తిడిని బాగా తట్టుకోగలుగుతారు.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)
Updated Date - Dec 09 , 2024 | 05:12 PM