Stickers on Fruits: పండుపై ఉన్న స్టిక్కర్ చెబుతున్న అసలు నిజాలు ఇవే..
ABN, Publish Date - Nov 19 , 2024 | 09:49 AM
పండ్లపై స్టిక్కర్లు కనిపించడం మనం చూస్తూ ఉంటాం. అయితే, వీటి అర్థం మాత్రం మనకు తెలియదు. ఏదో కొనేసుకుని వచ్చేస్తాం. పండ్లపై స్టిక్కర్ల మీనింగ్ ఏంటి? పండ్లపై స్టిక్కర్లు ఎందుకు పెడతారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Stickers on Fruits: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మార్కెట్‌లో రకరకాల పండ్లు దొరుకుతాయి. అయితే, మార్కెట్‌లో లభించే పండ్లపై స్టిక్కర్లు వేయడం కూడా మీరు గమనించి ఉంటారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో ప్రతి పండుకు, కూరగాయలకు స్టిక్కర్ వేస్తారు. అయితే, ఈ స్టిక్కర్లను పండ్లపై ఎందుకు వేస్తారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ స్టిక్కర్ల గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పండుపై ఉన్న స్టిక్కర్ చెప్పే వాస్తవాలు ఇవే:
పండ్లపై ఉన్న స్టిక్కర్లు వాటి నాణ్యత గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. పండు లేదా కూరగాయలను ఎలా పండించారు. ఏ పండ్లను కొనాలి, ఏ పండ్లు తీసుకోవడం మంచిది కాదు అనే విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి పండ్లను కొనుగోలు చేసే ముందు ఈ స్టిక్కర్ వెనుక ఉన్న వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.
4 అంకెల కోడ్:
పండ్ల స్టిక్కర్‌పై ఉన్న కోడ్‌ను PLU అంటారు. ఈ కోడ్ పండు ధరను గుర్తిస్తుంది. ప్రతి కోడ్‌కు దాని స్వంత అర్థం ఉంటుంది. మీరు ఈ కోడ్‌ను అర్థం చేసుకుంటే, కొనుగోలు చేయవలసిన పండ్ల గురించి కూడా మీకు తెలుస్తుంది. స్టిక్కర్‌పై నాలుగు అంకెల కోడ్ అంటే పండ్లను పండించే సమయంలో పురుగుమందులు, రసాయనాలు వాడారు. అంటే నాలుగు అంకెల సంఖ్య ఉంటే ఆ పండ్లు సాధారణంగా పెరిగినట్లు సూచిస్తుంది. ఈ పండ్లను తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
5 అంకెల కోడ్:
ఒక పండు 8తో ప్రారంభమయ్యే 5 అంకెల కోడ్ కలిగి ఉంటే ఆ పండు సేంద్రీయ పద్ధతిలో పండించబడిందని అర్థం. ఈ పండు జన్యుపరంగా పెరిగినట్లు సూచిస్తుంది. ఈ 5 అంకెల పండ్లను తీసుకుంటే తరచుగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
7తో ప్రారంభమయ్యే కోడ్:
ఒక పండు 7 సంఖ్యతో ప్రారంభమయ్యే 5-అంకెల కోడ్‌ను కలిగి ఉంటుంది. ఆ పండు సేంద్రీయ పద్ధతిలో పండించినది. అయితే, ఈ పండ్లు జన్యుపరంగా మార్పు చెందలేదని దీని అర్థం. మీరు ఈ పండును ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు. కాబట్టి, మీరు పండ్లు కొనడానికి మార్కెట్‌కి వెళ్లినప్పుడు, ఈ స్టిక్కర్‌లను చూసి పండ్లు కొనడం మంచిది.
Also Read:
అదృష్టవంతురాలికి మాత్రమే శరీరంలోని ఈ భాగంలో మచ్చ...ఆమె భర్త అంత లక్కీ మరెవరూ ఉండరు.!
Updated Date - Nov 19 , 2024 | 09:58 AM